మరో రికార్డుకు దుబాయ్ రెడీ..!

Dubai To Build World's Largest Shopping Mall

03:27 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Dubai To Build World's Largest Shopping Mall

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల్లో ఒకటి దుబాయ్‌. ఎత్తైన భవనాలు.. లగ్జరీ హోటళ్లు.. మానవ నిర్మిత ఐలాండ్స్‌ లాంటి ఎన్నో ప్రత్యేక నిర్మాణాలు ఇక్కడ నిర్మాణాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఓ భారీ షాపింగ్‌మాల్‌ నిర్మిస్తోంది దుబాయ్. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్‌ నిర్మించాలన్న ప్రణాళికను 2014లో సిద్ధం చేశారు. సుమారు 80లక్షల చదరపు అడుగుల స్థలంలో వివిధ మాల్స్‌తో పాటు.. థీమ్‌ పార్క్‌.. 100 హోటళ్లు.. 20 వేల గదులతో అపార్ట్‌మెంట్‌ నిర్మించనున్నారు. ఈ భారీ షాపింగ్‌మాల్‌ నిర్మాణానికి దాదాపు రూ.1.51 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దుబాయ్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ దీనిని నిర్మించనుంది. ఈ షాపింగ్‌మాల్‌ నిర్మాణం దుబాయ్‌ అతిథ్యం ఇవ్వబోతున్న ఎక్స్‌పో-2020 ప్రారంభం నాటికి 25 శాతం పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఈ నిర్మాణం పూర్తయితే ఆర్థికంగా.. దుబాయ్‌ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. మొత్తానికి దుబాయ్‌ మరోసారి రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యిందన్న మాట.

English summary

Dubai country was ready to set a new world record.Dubai was famous for world's largest buildings now dubai have decided to build worlds largest shopping mall in Dubai.This shopping mall was going to be build in 8 million square feet (745,000 square metres) of shopping space connected to a theme park, 100 hotels and serviced apartment buildings with 20,000 rooms.