వారం ముందే డబ్బింగ్ కంప్లీట్

Dubbing completed for Brahmotsavam movie

06:31 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Dubbing completed for Brahmotsavam movie

సూపర్‌స్టార్ మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత రాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదలకు కూడా రెడీ అయింది. మే 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘బ్రహ్మత్సవం’ టీమ్ చాలా బీజీగా ఉంది. మహేష్ కూడా తన వెర్షన్ డబ్బింగ్‌ను శబ్దాలయ స్టూడియోస్‌లో పూర్తి చేశాడు. సినిమా విడుదలకు వారం రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఆర్టిస్ట్‌లతో డబ్బింగ్ వర్క్స్ చిత్ర యూనిట్ పూర్తి చేస్తున్నారు. బుధవారానికి మొత్తం పూర్తి చేసి సెన్సార్‌కి సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే పీవీపీ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చిన ‘బ్రహ్మోత్సవం’ పాటలకు మంచి రెస్సాన్స్ వస్తోంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. మే 20న అభిమానులకు పండగే మరి.

English summary

Dubbing completed for Brahmotsavam movie. Dubbing completed for Mahesh Babu Brahmotsavam movie.