మూగ మనసులను ఏకం చేసిన  ఫేస్ బుక్

Dumb Couple Got Married In Andhra Pradesh

05:09 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Dumb Couple Got Married In Andhra Pradesh

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా మరో జంటను ఏకంచేసింది. పుట్టుకతోనే మూగ, చెవిటి యువతీయువకులను ఫేస్‌బుక్‌ ఒక్కటి చేసింది. వివరాల్లోకి వెళ్తే , కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన నాగార్జున, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం చౌడవరం గ్రామానికి చెందిన అనంత లక్ష్మీభవాని ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నారు. నాగార్జున ఎంబీఏ చదివి ఉద్యోగ వేటలో ఉన్నారు. లక్ష్మీభవాని బీఏ పూర్తిచేశారు. బదిరులైన వీరిద్దరూ స్నేహాన్ని పెంచుకొని, ప్రేమగా చిగురించింది. దీంతో ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఒకరు రాయలసీమ, మరొకరు కోస్తా ప్రాంతానికి చెందిన వారు కావడం, దూరాభారం వల్ల తల్లిదండ్రులు వారి పెళ్లికి మొదట నిరాకరించారు. తమ ఇద్దరిదీ ఒకేలాంటి జీవితమని, తమను ఒక్కటి చేయాలని వారిద్దరూ ఎట్టకేలకు పెద్దలను ఒప్పించారు. కడప జిల్లా వేంపల్లెలోని వాసవీ కల్యాణమండపంలో గురువారం పెళ్లి చేశారు. వారు అన్యోన్యంగా సంసార బంధాన్ని కొనసాగిస్తారన్న నమ్మకం ఉందని వధూవరుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆల్ ద బెస్ట్ చెప్పేయండి ..

ఇవి కూడా చదవండి: ప్రారంభమైన చిరు 150వ సినిమా

ఇవి కూడా చదవండి:అనంతపురం పొలంలో బంగారు నాణేలు దొరుకుతున్నాయట!

English summary

A Dumb Man Named Nagarjuna who belongs to Kadapa District and a Dumb Woman Named Ananta Lakshmi Bhavani who belongs to East Godavari District were met through facebook and they two loved each other and got married in a grand manner in Kadapa.