దసరా ఉత్సవాల్లో అమ్మవారిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

Durga Devi 10 avatharaalu

11:17 AM ON 28th September, 2016 By Mirchi Vilas

Durga Devi 10 avatharaalu

పండగల్లో దసరా అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరకూ ఇష్టమైన పండగే. ముఖ్యంగా విజయదశమి అంటే మరీ ఇష్టం. ఎందుకంటే, చెడుపై మంచి సాధించే అంతిమ విజయానికి ప్రతీక. ఇక దసరా ఉత్సవాల్లో ప్రధానంగా అమ్మవారిని కొలుస్తారు. పదిరోజుల పాటు వివిధ అలంకరణలతో అమ్మవారికి పూజలు చేస్తారు. జగన్మాత ఆదిపరాశక్తి. శక్తిస్వరూపిణి. అమ్మను నమ్ముకుంటే అపజయం ఉండదని భక్తుల విశ్వాసం. సంస్కృతికి స్త్రీయే ఆధారం. దసరా సెలవుల్లో ఉండే పిల్లలూ, ఇళ్లకు వచ్చే బంధువులూ, బంధాలు బలపడే ఈ దసరా పండుగలో లోగిళ్లు కళకళలాడే ఈ శరన్నవ వేడుకలలో స్త్రీయే కీలక పాత్రధారి.

దేవీ నవరాత్రుల పేరుతో వ్యవహరిస్తారు. అమ్మలగన్న యమ్మ- ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని ఆరాధించే నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి. ఆ రోజు నుంచే శరదృతువు ప్రారంభం కావడంతో వీటిని శరన్నవరాత్రులంటారు. పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పదోరోజైన దశమి నాడు దసరా పండుగ జరుపుకొంటారు. దీనినే విజయదశమి అంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజు కావడం వల్ల విజయదశమి జరుపుకొనే ఆచారం వచ్చినట్లు చెబుతారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి దేవీ నవరాత్రి సందడి ప్రారంభం కానుంది. నవరాత్రులలో అమ్మవారిని కొలిచే విధానం తెలుసుకుందాం..

1/11 Pages

1. శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి..


అమ్మవారి తొలిరోజు అలంకరణ ఇది. స్వర్ణకవచంతో అత్యంత విశిష్టమైన రూపంతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే అష్టకష్టాలు తీరడమే కాకుండా, సమస్త దారిద్య్ర బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.

English summary

Durga Devi 10 avatharaalu