ట్రంప్ ఓటమికి 135 కోట్లు కేటాయించారట!

Dustin Moskovitz ready to give 135 crores for Trump lose in elections

03:56 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Dustin Moskovitz ready to give 135 crores for Trump lose in elections

రాజకీయాల్లో ఎన్నో విచిత్రాలు చోటుచేసుకోవడం సహజం. ఇక కీలకమైన ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారం ఓ ఎత్తుఅయితే, గెలుపు ఓటములను నిర్ధేశించే కొన్ని బలమైన శక్తులు కూడా ఉంటాయి. నెగ్గడానికి అవసరమైన సాయం అందించేవాళ్లతో పాటూ, ఓడించడానికి సాయిశక్తులా కృషిచేసేవాళ్ళూ వుంటారు. నెగ్గడానికి ఎంతగా ఖర్చు చేస్తారో, ఓడించడానికి అంతే కసిగా డబ్బు వెచ్చిస్తారు. ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాలో కూడా జరిగేది అదే. అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ ఓటమి కోసం ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మోస్కోవిట్జ్ నిర్ణయించుకున్నారు.

అందుకే ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కు 20 మిలియన్ డాలర్ల(సుమారు రూ.135 కోట్లు) విరాళం అందించాలని నిర్ణయం చేసారు. విధానాలు, ఆలోచనలకు అతీతంగా ప్రజల్ని చీల్చేరీతిలో అమెరికాలో ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, దానిని అడ్డుకునేందుకే మిలియన్ల డాలర్లు ఇవ్వాలని తమ దంపతులు నిర్ణయించుకున్నట్లు డస్టిన్ చెప్పారు. తామిలా చేయడం ఇదే ప్రథమమని తెలిపారు. రిపబ్లికన్ పార్టీకి, ముఖ్యంగా ట్రంప్ నకు ఒక దార్శనికత లేదని ఆయన ధ్వజమెత్తారు. నవంబర్ లో ఎన్నికలు జరిగేలోపు ఇంకా ఎన్ని వింతలూ, చిత్రాలూ వుంటాయో చూడాలి.

ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్: అంత బడ్జెట్ పెట్టలేక ఆగిపోయిన మహేష్ సినిమా!

ఇది కూడా చదవండి: గుమ్మానికి మామిడి తోరణం కట్టడం వెనుక అసలు రహస్యం!

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం: హీటర్ ఎక్కువగా వాడుతుందని భార్య బట్టలు ఊడదీసి..

English summary

Dustin Moskovitz ready to give 135 crores for Trump lose in elections