'దువ్వాడ జగన్నాథమ్' పై క్లాప్ పడింది

Duvvada Jagannadham movie shooting starts

05:23 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Duvvada Jagannadham movie shooting starts

ఇలా అనుకున్నాడో లేదో గానీ అప్పుడే బన్నీ కొత్త సినిమాకు క్లాప్ కొట్టేసారు. సరైనోడుగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథమ్'(డీజే)గా రాబోతున్న సంగతి తెల్సిందే. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లు అరవింద్ తొలి సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. వీవీ వినాయక్, వంశీ పైడిపల్లి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ఫేస్ బుక్ ద్వారా వెల్లడిస్తూ ఫోటో పోస్ట్ పెట్టాడు. అన్నట్టు ఈ సినిమాకి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

1/4 Pages

English summary

Duvvada Jagannadham movie shooting starts. Stylish Star Allu Arjun latest movie Duvvada Jagannadham movie shooting starts.