ధోని కాలర్ పట్టుకున్న బౌలర్

Dwane Bravo Grabbed Dhoni Collar

01:27 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Dwane Bravo Grabbed Dhoni Collar

ప్రపంచంలోనే విధ్వంసకరమైన బాట్స్ మెన్ లలో ఒకడైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని షర్టు కాలర్ ను పట్టుకున్నాడు ఓ బౌలర్ . వార్మప్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని ప్రేక్షకులు , కెమెరాల ముందు అందరు చూస్తుండగానే ఇలా చేసాడు. ఇంతకి ఎవరా బౌలర్ .? ఎంటా ఆ మేటర్ ..? అనుకుంటున్నారా..!

వివరాలోకి వెళ్తే..భారత్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా భారత్ - వెస్టిండీస్ ల మధ్య జరిగిన వార్ముప్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టును భారత్ మట్టి కరిపించింది. మ్యాచ్ అనంతరం ఒక్కసారిగా మైదానం లోకి వచ్చిన వెస్టిండీస్ స్టార్ అల్ రౌండర్ డ్వేన్ బ్రావో ధోని దగ్గరకు వచ్చి ఉన్నట్టుండి ధోని కాలర్ పట్టుకున్నాడు. దీంతో ధోనితో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే బ్రావో ధోని కాలర్ పట్టుకుంది మాత్రం స్నేహం భావంతోనే, ఎందుకంటే ధోని , బ్రావో లు ఇద్దరు మంచి స్నేహితులు , ఐపీయల్ లో కుడా వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు ప్రాతినిద్యం వహించారు . ఆ స్నేహంతోనే బ్రావో ధోని కాలర్ పట్టుకున్నాడు.

ఎంత స్నేహం ఉంటే మాత్రం ఇలా అందరి ముందు బ్రావో ధోని కాలర్ పట్టుకోవడం ఏంటని బ్రేవో పై ధోని ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.

English summary

West Indies Star All Rounder Dwane Bravo Holds the Shirt ollar of Indian Team Captain Mahendar Singh Dhoni during the warm up match between India and West Indies.