ఒక ద్రాక్ష పండు ఖరీదు తెలిస్తే.. గుండె గుభేల్!

Each Ruby Roman grape cost was 25 thousand

11:47 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Each Ruby Roman grape cost was 25 thousand

ఏదైనా వస్తువు కొనేటప్పుడు రేటు చెబితే, అమ్మో అంత ఉందా, ఇక తగ్గదా అని అడగడం రివాజే. ఇక మనం సాధారణంగా కేజీ ద్రాక్ష కొనడానికి వెళ్తే, రూ.100 అని చెబితే, కొనడానికి వెనుకాడతాం. అలాంటిది కేవలం ఒక్క ద్రాక్ష పండు రుచి చూడాలంటేనే భారీ మొత్తం ఖర్చు చేయాలంటే, ఇక గుండె జారిపోతుంది. అవును నిజం ఒక్కో పండుకి పాతిక వేల రూపాయలు చెల్లించాలట. వీటిలో చక్కెర 18 శాతం ఉంటుంది. ఒక్క ద్రాక్ష పండు 20 గ్రాములకు పైగా బరువు తూగుతుంది. అమ్మో.. ఇంత ఖరీదా? అయినా ఇది పండా, అమృతమా.. అని వెనుకా ముందూ చూడకుండా అడిగేస్తాం.

1/4 Pages

అయితే జపాన్ లో ఇప్పుడు కొన్ని పండ్లను అమృతంతో సమానంగానే భావిస్తున్నారు. వాటి ధరలు కూడా అలాగే ఉన్నాయనడానికి ఈ సంఘటన తార్కాణం. పండ్లలో కొత్త కొత్త రకాలను ఉత్పత్తి చేసే దేశంగా జపాన్ ఖ్యాతి గాంచింది. కొత్త, ఖరీదైన, అరుదైన పండ్లను కొనుగోలు చేయడం అక్కడివారికి స్టేటస్ సింబల్. వివాహ, వ్యాపార సమావేశాలకు, ఆసుపత్రిలో ఎవరినైనా కలవాల్సిన సమయంలో ఇలాంటి పండ్లను ఇచ్చిపుచ్చుకోవడం ఇరువర్గాల గౌరవ మర్యాదలకు సంకేతంగా భావిస్తారట. ఇక ఇలాంటి పండ్లను విక్రయించే దుకాణాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.

English summary

Each Ruby Roman grape cost was 25 thousand