చిన్నారిని గద్ద తన్నుకుపోతుంటే...(వీడియో)

Eagle Attacked 7 Year Old Boy In Australia

11:21 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Eagle Attacked 7 Year Old Boy In Australia

తన తల్లితో వచ్చిన ఏడేళ్ళ కుర్రాడిపై ఓ భారీ గద్ద వాలి లాక్కునిపోవడానికి ప్రయత్నించిన ఘటన సెంట్రల్ ఆస్ట్రేలియా లోని స్ప్రింగ్స్ డెజర్ట్ పార్క్ లో చోటుచేసుకుంది. ఈ వింత ఘటనకు సంబంధించి,వివరాల్లోకి వెళ్తే, దాని దాడిలో ఆ బాలుడి ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఆ చిన్నారి తలపై ధరించిన ఆకుపచ్చని టోపీ వంటి దాన్ని చూసిన గద్ద అది జంతువని భ్రమించిందని..అందుకే ఈ దాడి చేసిందని అంటున్నారు. బర్డ్స్ ఆఫ్ ప్రే పేరిట ఈ పార్క్ లో జరిగిన ఓ షో సందర్భంగా ఈ వైనం చోటు చేసుకుంది.

ఈ ఎటాక్ దృశ్యాన్ని ఈ చిన్నారి తల్లి ఆన్ లైన్ లో షేర్ చేసింది. కొందరు గద్దలను పెంచి వాటికి శిక్షణ ఇచ్చి వాటిని వదలగానే అవి తమ ఆహారాన్ని వెదుక్కుంటూ ఇలా తమ ఎరలపై (చిన్న జంతువులు, పక్షులు) దాడి చేసి వాటిని కబళిస్తాయి.

గద్దల ట్రైనర్లకు ఇదో వినోదంగా ఉంటుంది. తరచూ ఇక్కడ వీటికి పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇక తాజా ఘటనలో, గాయపడిన చిన్నారి ముఖానికి అయిన గాయాలకు ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆ కుర్రాడు కోలుకుంటున్నా, ఈ షాకింగ్ ఇన్సిడెంట్ నుంచి వాడు గానీ, వాడి తల్లి గానీ ఇంకా తేరుకోలేదు.దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:అపరిచితులతో డేటింగ్ చేసేసారు...

ఇవి కూడా చదవండి:చేతి రేఖలు ( ‘M’) ఆకారంలో ఉంటే, ఏమవుతుందో తెలుసా ?

English summary

An Eagle attacked a 7 year old boy in Australia in Birds Of Prey. The little boy was injured with the eagle attack and the officials were ordered to know the reasons behind this attack.