ఆఫ్ఘనిస్తాన్‌లో స్వల్ప భూప్రకంపనలు

Earth Quake In Afganistan

07:26 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Earth Quake In Afganistan

ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలు తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైంది. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రం ఉంటుందని పాకిస్థాన్ రేడియో పేర్కొంది. భూకంపం వల్ల ఉత్తర భారత దేశం కూడా ప్రకంపనలకు లోనైంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలియరాలేదు. భూకంప తీవ్రత పాకిస్థాన్‌లోనూ కనిపించింది. పెషావర్‌లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇండ్లు, ఆఫీసుల నుంచి జనం భయంతో పరుగులు తీశారు. ఖైబర్-పక్తున్కా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కుగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ మొబైల్ సేవలకు ఆటంకం ఏర్పడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఈ మధ్యే 6.9 తీవ్రతతో భూకంపం నమోదైంది.

English summary

The India Meteorological Department said the earthquake measuring 5.8 on the Richter scale originated in Afghanistan's Hind Kush mountains, near Jarm in Afghanistan, at 2.07 pm.