రష్యాలో భారీగా భూ ప్రకంపనలు

Earth Quake In Russia

10:45 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Earth Quake In Russia

ఇప్పుడు రష్యా వంతు అయింది. శనివారం ఉదయం రష్యా తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవించే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతానికి సమీపంలో భూకంపం సంభవించిన ప్రాంతం ఉంది. రష్యాలోని యోలిజోవో పట్టణానికి 95కి.మీల దూరంలో 160కి.మీల లోతుతో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే సునామీ హెచ్చరికలు లేవని నేషనల్‌ అండ్‌ పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. నష్టం వివరాలు ఇంకా తెలియ రాలేదు.

English summary