ఇండో - మాయన్మార్ బోర్డర్ లో భూకంపం

Earthquake In India-Mayanmar Border

10:41 AM ON 4th January, 2016 By Mirchi Vilas

Earthquake In India-Mayanmar Border

ఈ మధ్య వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా భారత్‌- మయన్మార్‌ సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున 4.40గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ ప్రకటించింది. ఈ భూకంపం కారణంగా బంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఇంఫాల్‌లో ఒకరు మృతిచెందగా.. 21 మంది గాయపడ్డారు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు 33 కి.మీ దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు చలి లోనే వణుకుతూ వీధుల్లో గడిపారు. కాగా బంగాల్‌లోని శీలిగుడిలో భూప్రకంపనలు వచ్చినట్లు కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

నెల్లూరు జిల్లాలోనూ .....

కాగా ఓ రోజు ముందే ఎపిలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో కూడా పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. చాకలకొండ, బత్తినవారిపల్లె, వూటుకూరు, దత్తులూరులో 3 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రకంపనల ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు

English summary

Six persons were died and almost 100 people were injured in Manipur when a 6.7 magnitude earthquake hit northeastern India early Monday morning