ఆఫ్ఘనిస్తాన్‌ లో భూకంపం...ఇండియా,పాకిస్తాన్ లలో భూ ప్రకంపనలు 

Earthquake Shakes In India,Afghanistan,Pakistan

02:06 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Earthquake Shakes In India,Afghanistan,Pakistan

శుక్రవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌ భూకంపం చోటు చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌ లోని హిందూకుష్‌ పర్వత్‌ శ్రేణులో భూకంపం కేంద్రంగా భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేలు పై 6.4 తీవ్రతగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ భూకంపం ధాటికి ప్రజల తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్ళనుండి వీధుల్లోకి పరుగులు తీసారు. ఈ భూకంపం కేవలం ఆఫ్ఘనిస్తాన్‌ లోనే కాక భారత్‌లోని దక్షినాది ప్రాంతాలలో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్‌ లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు అనేక చోట్ల కూడా ఈ భూకంపం తీవ్రత కనిపించింది. దీంతో భారత, పాకిస్తాన్‌ ప్రభుత్వాలు హై అలెర్ట్ ప్రకటించాయి. ఈ భూకంపంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, 39 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

గత అక్టోబర్‌ భూకంపం సంఘటనలను మరువక ముందే మళ్ళీ భూకంప రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

English summary