భారత్ కు పొంచి వున్న భారీ భూకంప ముప్పు.... వినాశనం తప్పదా?

Earthquake will destroy India

01:50 PM ON 13th July, 2016 By Mirchi Vilas

Earthquake will destroy India

ఇప్పటివరకూ ఎన్నో భూకంపాలు వచ్చాయి. గుజరాత్ లోని లాతూర్ లో వచ్చిన భూకంపం కూడా భారీగానే నష్టం వాటిల్లింది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే పలువురు అప్పట్లో బాధితులను ఆదుకున్నారు. అయితే ఇప్పుడు భారత్ కి భారీ భూకంపం పొంచి ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాన్ని నాశనం చేసేందుకు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రహస్యంగా పెను భూకంపం పొంచి ఉందా? అంటే అవుననే హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూఅంతర్భాగంలో ఇది ఏర్పడే ప్రమాదముందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది.

భూమి అడుగున ఉన్న టెక్టానిక్ట్ ప్లేట్ల మధ్య ఒత్తిడి అధికంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల భారతలోని ఈశాన్య భారతంలోని పట్టణ ప్రాంతాలు నాశనమవుతాయని హెచ్చరించారు. సుమారు 14కోట్ల మందిపై ఈ ప్రభావం పడుతుందని దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రధాన నదుల్లోని నీటి మట్టాల్లో, నీటి ప్రవాహాల్లో గణనీయమార్పులు చోటుచేసుకుంటాయని అంటున్నారు. భూమి పొరల్లోని టెక్టానిక్ట్ ప్లేట్లు కుంగిపోవడం వల్ల ఆ భూభాగంలో ఒత్తిడి పెరిగి, ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్త మైకెల్ స్టెక్లర్ వివరించారు.

హిందూ మహాసముద్రంలోని భూకంపం, 2004లో సుమారు 2,30,000 మందిని పొట్టనపెట్టుకున్న సునామీ, 2011 తొహోకూలో భూకంపం సంభవించిన ప్రాంతాలన్నీ ఇలా ఏర్పడినవేనని గుర్తుచేస్తున్నారు. ఊహించని పరిణామాలు ఎదురైతే.. బీభత్సం తప్పదని, రిక్టర్ స్కేల్ పై 8.2 కంటే ఎక్కువ తీవ్రతలో భూకంపం విరుచుకుపడుతుందట. ప్రకృతి ప్రళయం వస్తే, ఆపడం తరమా అంటున్నారు అంతా. కిమ్ కర్తవ్యం

English summary

Earthquake will destroy India