ఉగాండాలో తెలుగోడి దారుణ హత్య

East Godavari Man Killed In Uganda

11:16 AM ON 7th December, 2015 By Mirchi Vilas

East Godavari Man Killed In Uganda

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం , వేమపరప్పాడు కు చెందిన సంజయ్‌ అనే వ్యాపారస్తుడు ఉగాండాలో దారుణహత్యకు గురయ్యాడు.

ఈ నెల 3వ తేదిన రాత్రి ఉగాండా లోని కంపాల అనే నగరంలో సంజయ్‌ను స్థానిక సెక్యూరిటీ గార్డులు డబ్బులు ఇవ్వమని డిమాండ్‌ చేసారు. వారికి డబ్బులు ఇవ్వడానికి సంజయ్‌ నిరాకరించడంతో సెక్యూరిటీ గార్డులు సంజయ్ పై కాల్పులు జరిపారని సమాచారం. దీని పై కేసు నమోదు చేసిన ఉగాండా పోలీసులు సంజయ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని భారత్‌కు తరలించారు. 17 ఏళ్ళగా వ్యాపార రిత్యా తన కుటుంబ సభ్యులతో ఉగాండాలోనే జీవిస్తున్న సంజయ్‌కు ఇలా జరగడంతో ఆయన సొంతూరు వేమపరప్పాడులో విషాదఛాయలు నెలకొన్నాయి.

English summary

A businessman named sanjay who belongs to amalapuram,east godavari district had killed by security gaurds in uganda for not giving money