కూరగాయలపై పెస్టిసైడ్స్ ప్రమాదం - అందుకే ఇలా తొలగించుకోవాలి

Easy process to remove pesticides in vegetables

12:08 PM ON 3rd February, 2017 By Mirchi Vilas

Easy process to remove pesticides in vegetables

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు. తినే తిండి గగ్గరనుంచి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే, ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. కానీ కూరగాయాలు,ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్దాలలో భాగం..అధిక దిగుబడి కోసం వాడే రసాయన ఎరువులు వాడకం ఎక్కువయింది కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు… వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి.. అందుకే కూరగాయాలపై ఉన్న పెస్టిసైడ్స్ ను క్లీన్ చేసుకోవాలి. అందుకు కొన్ని పద్ధతులున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.మనలో చాలామంది చల్లటి నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని బాగా స్క్రబ్ చేస్తేనే కూరగాయలపై ఉన్న రసాయనాలను తొలగించగలుగుతాం అనే విషయం గుర్తుంచుకోవాలి. కూరగాయలపై పెస్టిసైడ్స్ ను క్లీన్ చేయడానికి ఉప్పునీరు మనకు చాలా హెల్ప్ చేస్తుంది.గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉప్పు వేసి అరగంట పాటు కూరగాయలను అందులో వేసి,తర్వాత వాడుకుంటే పెస్టిసైడ్స్ సమూలంగా తొలగిపోతాయట.

కూరగాయలపై పెస్టిసైడ్స్ ను తోలగించడానికి వెనిగర్ బాగా ఉపయోగపడ్తుంది.దీనికోసం ఒక కప్ వెనిగర్ చేర్చి ఆ వాటర్ లో కూరగాయలు నానపెట్టి అరగంటయ్యాక వాడుకుంటే చాలు సరిపోతుంది.ఎక్కువ టైం లేని వాళ్లు ఒక స్పూన్ నిమ్మరసం,రెండు స్పూన్ల వెనిగర్ ,ఒక కప్ వాటర్ లో కలుపుకుని స్ప్రే బాటిల్ ల్ నింపుకోవాలి,కూరగాయలు కట్ చేసుకునే ముందు ఆ మిశ్రమాన్ని కూరగాయలపై స్ప్రే చేసి వెంటనే కట్ చేస్కోవచ్చు.

పండ్లు కానీ,కూరగాయలకు కానీ పైతొక్క తీసి వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ అన్నింటిని అలా వాడుకోవడం అనేది సాధ్యం కాద న్నది మనందరికీ తెల్సిన విషయమే కదా.

ఇది కూడా చూడండి: వామ్మో ... అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ !?

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

English summary

there are some easy methods to remove pesticides on vegetables and fruits.