అలసటకు దివ్య మంత్రం ఇదే - 30 సార్లు పలికితే చాలట

Easy way for stress removal

06:43 PM ON 10th February, 2017 By Mirchi Vilas

Easy way for stress removal

మంత్రాలకు మహిమలున్నాయా లేదా అనేది పక్కన పెడితే, కొన్ని మంత్రాలను , అక్షరాలను పలికితే, శరీరానికి , ఆరోగ్యానికి ఎంతోమంచిదని ప్రూవ్ అయింది కూడా. ఇక ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్ లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే, కోల్ కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసి,ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్ డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని నిరూపించింది..దీనికోసం తను 17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.

ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గడం గమనించింది. ఉత్తరాఖండ్ లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్ కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో అన్వేష ఆశ్చర్యపడింది.అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్ ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్ మిటర్స్ తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి…ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష చెబుతోంది. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి.

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

ఇది కూడా చూడండి: సోయా.. తింటే మగాళ్లకు పెద్ద డామేజి ?

English summary

There are easy ways for removing stress levels by sounding oam mantram.