ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా ఉండాలంటే నెలకోసారి ఈ అన్నం తింటే చాలు!

Eat Bishopsweed rice for monthly once

11:13 AM ON 16th September, 2016 By Mirchi Vilas

Eat Bishopsweed rice for monthly once

ప్రతీ ఒక్కరు ఎంత డబ్బు సంపాదించినా వారు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సంపదని అనుభవించగలరు. అయితే కొంత మంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ ఎటువంటి అలుపు లేకుండా కష్టపడడంతో ఎన్నో అనారోగ్యాలకు గురౌతారు. కొంతమంది డబ్బు సంపాదిస్తారు, దానితో పాటే ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో నియమాలు పాటిస్తారు. అందరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోలేం. అయితే ఏవేవో నియమాలు పాటించకుండా సింపుల్ గా ఇది పాటిస్తే చాలు ఆరోగ్యంగా ఉండవచ్చు. వివరాల్లోకి వెళితే..

1/18 Pages

ఇది సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, కాసింత వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది అనే అమ్మమ్మల మాటలు గుర్తుండేవుంటాయి. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండీ వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలీవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది. మంచి ఆరోగ్యం కోసం నెలకోసారి ఈ వాము అన్నం తింటే చాలు..

English summary

Eat Bishopsweed rice for monthly once. Bishopsweed rice is good for health. So please eat this rice for monthly once.