క్రీడల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే ఇది తినాల్సిందే!

Eat Lettuce to play well

10:27 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Eat Lettuce to play well

ఇప్పుడు ఏమాత్రం మీ పిల్లల క్రీడా నైపుణ్యం గురించి బెంగ పెట్టుకోనక్కర్లేదు. మీ పిల్లల్ని మంచి క్రీడాకారులుగా తయారు చేయాలని, బరిలోకి దిగితే దుమ్మురేపాలని కోరుకుంటున్నట్టయితే, ఇప్పటి నుంచే పాలకూరను ఎక్కువగా తినిపించడం అలవాటు చేయండి. ఎందుకంటే ఆటలాడినప్పుడు శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గి, అలసిపోతారు. అయితే పాలకూర ఎక్కువగా తినేవారు ఆక్సిజన్ తక్కువగా ఉన్న సమయంలో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తారట. ఇందుకు కారణం పాలకూరలో అధిక మోతాదులో ఉండే నైట్రేట్ కారణమని బెల్జియంలోని లీవెన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.

ఇందుకోసం 27 మంది క్రీడాకారులపై వారం రోజులపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. కూర్చున్నప్పుడు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేసేటప్పుడు నైట్రేట్ పనితీరును పరిశోధకులు పరిశీలించారు. వారిలో నైట్రేట్ తీసుకున్నవారి కండరాల్లో అద్భుతమైన పటుత్వం వచ్చినట్లు గుర్తించారు. సహజ పద్ధతుల్లో నైట్రేట్ శరీరానికి అందించడానికి అత్యుత్తమ మార్గం పాలకూర తినిపించడమేనని యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ హెస్పెల్ తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

English summary

Eat Lettuce to play well