కిడ్నీల్లో రాళ్లు చేరకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..

Eat limited food for good health

12:51 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Eat limited food for good health

మితాహారంతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెప్పేమాట. ఇక తక్కువ ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు మనకు 2,200 కేలరీల శక్తి సరిపోతుందట. ఈ మేరకు శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మనకు సరిపోతుందని అంటున్నారు. అంతేకాదు ఈ కేలరీలు ఖర్చయ్యేలా కూడా మనం కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు. ఇంతకన్నా ఎక్కువ కేలరీలను ఆహారంలో తీసుకుంటే మాత్రం మనకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

రోజుకు అవసరానికి మించిన కేలరీలను ఆహారంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ముప్పు 42 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. అలాగే రోజూ కొద్దిసేపు వ్యాయామం చేసేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు 31 శాతం దాకా తగ్గుతున్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలిందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: నత్త విషం తాగితే ఆ రోగం తగ్గిపోతుందట!

ఇది కూడా చదవండి: ప్రెగ్నెంట్ అయిన మొదటి 3 నెలలు కచ్చితంగా పాటించవలసిన నియమాలు

ఇది కూడా చదవండి: టీనేజ్ లోనే తెల్ల జుట్టు వచ్చినవారు అస్సలు చెయ్యకూడని తప్పులు!

English summary

Eat limited food for good health. Eat daily limited health for not get stones in kidneys.