సంతానం పొందాలంటే ఇవి తినాల్సిందే...

Eat these foods for pregnancy

12:50 PM ON 26th November, 2016 By Mirchi Vilas

Eat these foods for pregnancy

సంతానం పొందాలని చాలా మంది మహిళలు అనుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రం ఆ భాగ్యానికి నోచుకోరు. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది ఎండోమెట్రియోసిస్. అంటే గర్భాశయానికి బయటి వైపున ఓ రకమైన కణజాలం పెరుగుతుంది. దీని వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. రుతు సమస్యలు వస్తాయి. రుతు క్రమం సరిగ్గా ఉండదు. ఒక్కోసారి అండాలు పక్వదశకు రాకుండానే దెబ్బతింటాయి. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే పలు ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ సమస్యను అధిగమించవచ్చని తెలిసింది. సౌతాంప్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎండోమెట్రియోసిస్ కు సంబంధించి ఎలుకలపై పలు ప్రయోగాలు చేశారు. అందులో తెలిసిందేమిటంటే...

1/5 Pages

ద్రాక్ష పండ్లు, వేరు శెనగ, బ్లూబెర్రీలలో ఉండే పలు రకాల పదార్థాలు ఎలుకల్లో వచ్చే ఎండోమెట్రియోసిస్ సమస్యకు విరుగుడుగా పనిచేశాయట. దీంతో వారు ఏం చెబుతున్నారంటే మహిళలు ద్రాక్ష పండ్లు, వేరు శెనగ, బ్లూబెర్రీ వంటి పండ్లను తింటే వారిలో వచ్చే పై సమస్య తగ్గుముఖం పడుతుందట.

English summary

Eat these foods for pregnancy