ఇవి తింటే అన్నిరకాలుగా పుష్టిగా ఉంటారట

Eating A Mediterranean Diet To Stop Your Brain Shrinking

11:48 AM ON 6th January, 2017 By Mirchi Vilas

Eating A Mediterranean Diet To Stop Your Brain Shrinking

పూర్వం తిండికి ఇప్పటి తిళ్ళకి చాలా తేడా ఉందని పెద్దలు చెబుతుంటారు. అన్నీ కల్తీ కావడంతో ఏమి తిన్నా ప్రయోజనం ఉండడం లేదని, పూర్వం తిళ్ళు ఇప్పుడు లేవని పలువురు అంటూంటారు. అయితే ఇప్పుడు కూడా సరైనవి ఎంచుకుంటే తిండి పుష్టి ఉంటే కండపుష్టితో బాటు మెదడు పుష్టి కూడా కలుగుతుందని తాజా పరిశోధనలు తేల్చాయి. యూనివర్సిటి ఆఫ్ ఎడిన్ బరోకు చెందిన మరో సైంటిస్ట్ డాక్టర్ మైఖెల్లో లూసియానో జరిపిన పరిశోథనలు వయసు పెరిగేకొద్దీబ్రెయిన్ లో ఉండే మెమొరీ, వినికిడిశక్తి సంబంధించిన కణాలు నిర్వీర్యమైపోకుండా సంతులిత ఆహారపు అలవాట్లు కాపాడుతాయని తేలింది

తొలినాటి నుంచి కూడా మీరు సంతులిత ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే బ్యాలెన్స్డ్ డైట్ కు అలవాటు పడితే నే మంచిదటు.డైలీ తినే ఫుడ్లో ఎక్కువగా కూరగాయలు, పళ్లు, ఆలివ్ ఆయిల్, తో బాటు ఒక గ్లాస్ వైన్ కూడాతీసుకుంటే సెవెంటీస్ లో వచ్చే మెదడు కుచించుకుపోవడం లాంట సమస్య దరిజేరదంటున్నారు డాక్టర్లు.

ఆయా రకాల పదార్ధాలుతీసుకోని వారిని పరిశీలిస్తే.. మెదడు కుచించుకుపోవడం, మెమొరీ లాస్, ఆల్జీమర్స్ లక్షణాలు బయటపడ్డాయట.సో.. మీరిప్పటికీ ఇంకా మధ్యధరా ఆహారపు అఅవాట్లు చేసుకోకపోతే వయసుతో వచ్చే సమస్యల బారిన పడకతప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక మీరు తినే ఆహారంలో రోజూ పండ్లు, వెజిటబుల్స్, ఆలివ్ ఆయిల్ ఉండేట్టు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పళ్లు, తాజాకూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆక్సీకరణానికి ,న్యూరల్ డీ జనరేట్ గాకుండా తోడ్పడతాయని నివేదికల్లో చెప్పేమాట. అదేవిధంగా మాంసకృత్తులు, పాల పదార్ధాలు, అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే.. మెదడు కుచించుకుపోవడం, మెదడులో ఉండే కణాలు దెబ్బతినడం, పార్కిన్ సన్ వ్యాధి బారినపడే ప్రమాదం తగ్గడం, క్యాన్సర్, కార్డియోవాస్క్యులార్ వ్యాధులనుంచి బయట పడొచ్చని డాక్టర్లు స్పష్టంచేస్తున్నారు.

ఇది కూడా చూడండి: గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఇబ్బందే.. అయితే ఏం చేయాలి

ఇది కూడా చూడండి: శంఖం ప్రత్యేకత ఏమిటో తెలుసా

English summary

Eating A Mediterranean Diet To Stop Your Brain Shrinking.