గుండెపోటుని అడ్డుకునే ఆయుధం ఇదే!

Eating One Egg A Day Could Reduce Heart Disease

11:41 AM ON 28th December, 2016 By Mirchi Vilas

Eating One Egg A Day Could Reduce Heart Disease

అది ఏసమస్య అయినా సరే, గోటితో పోయడానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు. సమస్య పెద్దగా అయ్యాక, ప్రయత్నాలు మన తాహతుకి మించి చేయడం కన్నా, సమస్య మొదలవకుండా, చిన్ని చిన్ని మార్గాలతోనే పెద్ద పెద్ద సమస్యలను అడ్డుకుంటే బెటర్ అని దీనర్ధం. ఇక ఆరోగ్య సమస్యలు కూడా అంతే. అందులో ముఖ్యంగా గుండెపోటు చాలా ప్రమాదకరం కదా. దాన్ని అడ్డుకునే చిన్ని ఆయుధం ఒకటి ఉందట. అదేమిటో చూద్దాం.

సగటున ఒక పెద్ద సైజ్ కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై క్వాలిటి ప్రొటీన్, రెండురకాల యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,డి,ఈ ఉంటాయి. ఇలా న్యూట్రింట్స్ సంపన్న ఆహారం కాబట్టే, రెగ్యులర్ గా ఉడకబెట్టిన గుడ్డుని తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం 12% తగ్గుతుందట. ఈ విషయం మనం చెప్పేది కాదు. అమెరికాలో ఓ ప్రోఫేసర్ డామినిక్ అలెగ్జాండర్ కొన్నేళ్ళుగా రిసెర్చి చేసి, ఫలితాలు వెల్లడించాడు.

ఈ రిసెర్చి ఏదో చిన్నగా కాదు ఏకంగా మూడు లక్షలమందికి డైట్ లో గుడ్లని రోజూ అందిస్తూ, కొన్నేళ్ళపాటు పరీక్షలు చేశారు. ఆ తరువాత జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రీషన్, అమెరికన్ ఎగ్ బోర్డ్ ఈ ఫలితాలనయ ప్రకటించారు.

ఇంతకీ ఆ ప్రొఫేసర్ ఏమి చెప్పాడంటే, ” గుడ్డులో యాంటిఆక్సిడెంట్ ప్రపార్టీస్ బాగా ఉండటం వలన ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇంఫ్లేమేషన్ ని అడ్డుకుంటాయి. గుడ్లలో ప్రొటీన్ కూడా బాగా దొరకడంతో ఇవి బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి” అని.

ఇది కూడా చూడండి: మగవారు ఈ 4 విషయాలు ఎప్పటికీ ఇతరులతో పంచుకోకూడదట!

ఇది కూడా చూడండి: ఉదయం నిద్రలేవగానే చూడవల్సిన, చూడకూడని వస్తువులు..

English summary

Eating One Egg A Day Could Reduce Heart Disease.