ఒకేసారి రెండు తెలుగుదేశం పార్టీలు రద్దు

EC Banned Two TDP Parties NTR TDP And Anna TDP

11:23 AM ON 26th December, 2016 By Mirchi Vilas

EC Banned Two TDP Parties NTR TDP And  Anna TDP

ఇదేమిటి ఏపీలో టిడిపి అధికారంలో వుంది కదా. పార్టీ రద్దు అవ్వడం ఏమిటి అనుకుంటున్నారా? రద్దయిన మాట వాస్తవం అయితే ఇక్కడే ఓ కిటుకు వుంది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న టిడిపి రద్దవ్వలేదు. ఒకప్పుడు నందమూరి లక్ష్మీ పార్వతి పెట్టిన 'ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ', అలాగే నందమూరి హరికృష్ణ పెట్టిన' అన్న తెలుగుదేశం పార్టీ' రద్దయ్యాయి. ఎన్నికలకు దూరంగా ఉన్న నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కొరడా ఝుళిపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 12 రాజకీయ పార్టీల నమోదును రద్దు చేసింది. 2005 సంవత్సరం నుంచి జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను గుర్తించాలని ఎన్నికల సంఘం భావించి కసరత్తు చేసింది. ఆయా పార్టీల నమోదు సందర్భంగా పేర్కొన్న చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ పేర్కొంది.

ఈసీ రద్దు చేసిన రాజకీయ పార్టీల వివరాల్లోకి వెళ్తే,

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ , అన్న తెలుగుదేశం పార్టీ, ఆంధ్రనాడు పార్టీ , జై తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ,ముదిరాజ్ రాష్ట్రీయ సమితి ,నేషనల్ సిటిజన్ పార్టీ ,సత్యయుగ్ పార్టీ ,భారతీయ సేవాదళ్ ,ఆల్ ఇండియా సద్దుగణ పార్టీ ,బహుజన రిపబ్లికన్ పార్టీ రద్దయ్యాయి.

ఇది కూడా చూడండి: భారత్ లో ఏటా కోటి సంపాదించేవాళ్ళు ఎందరో తెలుసా?

ఇది కూడా చూడండి: ఆఫీస్ లో లేడీ బాస్ కంటే మెన్ బాస్ ఉంటే కలిగే ప్రయోజనాలు...

ఇది కూడా చూడండి: స్త్రీల గురించి చాణక్యుడు చెప్పిన అపురూప విషయాలు

English summary

EC Banned Two Telugu Desam Parties that is Lakshmi Parvathy NTR TDP and Harikrishna Anna TDP.