ఇకోస్పోర్ట్‌ వాహనాలను రీకాల్‌ చేసిన ఫోర్డ్‌

EcoSport Recalled in India

05:34 PM ON 13th November, 2015 By Mirchi Vilas

EcoSport Recalled in India

అమెరికన్‌ కార్ల ఉత్పత్తిదారు ఫోర్డ్‌ తన ఇకోస్పోర్ట్‌ ఎస్‌యువి శ్రేణి కార్లను కొన్నింటిని రీకాల్‌ చేసినట్టు ప్రకటించింది. కంపాక్ట్‌ ఎస్‌యువి శ్రేణి కార్ల మార్కెట్‌లో మంచి క్రేజ్‌ సంపాదించిన ఇకోస్పోర్ట్‌ కార్లలో సాంకేతిక లోపం కారణంగా 16444 కార్లను రీకాల్‌ చేసింది. రీకాల్‌ చేసిన కార్లు చెన్నైలోని ఫ్యాక్టరీలో నవంబర్‌ 2013, ఏప్రిల్‌ 2014 మధ్య కాలంలో తయారు అయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే కంపెనీ కార్ల యజమానులను సంప్రదించి సాంకేతిక లోపాలను సవరించనున్నట్లు, అది కూడా ఎటువంటి చార్జీలు లేకుండానే చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

English summary

EcoSport Recalled in India.ford Ecosport recalled in india