జగన్ లోటస్ పాండ్ అటాచ్ చేసిన ఈడీ

ED attaches assets of Jagan

12:33 PM ON 30th June, 2016 By Mirchi Vilas

ED attaches assets of Jagan

ఫారిన్ టూర్ లో ఆటలాడుతున్న (గోల్ఫ్ , చెస్ వగైరా) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈడీ మరో కొరడా ఝులిపించింది. తాజాగా జగన్ కు సంబంధించిన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. హైద్రాబాద్ లో జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటిని, బెంగళూరులోని జగన్ నివాసాన్ని, మరికొన్ని ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. జగన్ కు సంబంధించిన ఈ ఆస్తుల విలువ రూ. 750 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఓపెన్ మార్కెట్ లో ఆస్తుల విలువ రూ. 5వేల కోట్లుగా దర్యాప్తులో తేలింది.

అంతేకాక, బెంగళూరులోని మంత్రి వాణిజ్య భవన సముదాయాన్ని కూడా అటాచ్ చేసింది. భారతి సిమెంట్స్ కు రూ. 152 కోట్ల విలువైన సున్నపురాయి గనులను అక్రమంగా కేటాయించినట్టు నిర్ధారణ అవడంతో జగన్ పేరుతో ఉన్న ఆస్తులన్నీ ఈడీ జప్తు చేసింది. ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో జగన్ ప్రస్తుతం నివాసం ఉంటోన్న లోటస్ పాండ్ లోని ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సాక్షి మీడియా గ్రూప్ కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తానికి కేసు వేగంగానే ముందుకు నడుస్తోంది.

ఈడీ అటాచ్ చేసుకున జగన్ ఆస్తుల వివరాలు...

ఆస్తులు విలువ(లక్షల్లో)
1. క్లాసిక్ రియాల్టీ కంపెనీకి చెందిన కామర్స్ @ మంత్రి,
బెంగళూరులో బన్నేఘట్టా రోడ్డు 4945.63
2. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు చెందిన
903.28 ఎకరాలు, గుంటూరు 3184.42
3. ఉటోప్ లా ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కాప్స్ స్టోన్, హరీష్
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పేరుమీద 5689.72
లోటస్ పాండ్ హౌజ్ లోని ప్లాట్ నెం.3,4,6,7,8,
హూడా హైట్స్, హాకీంపేట్, హైదరాబాద్
4. కాటేదాన్, రాజేంద్రనగర్ ప్రాంతంలో నివిష్
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన 9680 గజాల స్థలం 811.32
5. మహేశ్వరం మండలం సర్దార్ నగర్ గ్రామంలో
సర్వే నం.18/1,19/1, 20 లో 32.31ఎకరాల స్థలం 646.24
6. కర్ణాటక చెన్నరాయపట్నం హోబిల్ ప్రాంతంలో
రేవన్ ఇన్ ఫ్రా కంపెనీ పేరు మీదున్న 9 ఎకరాల స్థలం 679.03
7. బెంగళూరులోని హోబ్లీ భగవత్ ఎస్టేట్స్ ప్రై.లిమిటెడ్
పేరు మీద 59,070 ఎస్ ఎఫ్టీ స్థలం 264.54
8. షాలోమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లిమిటెడ్ పేరు మీద ఉన్న
సాక్షి టవర్స్ బంజారాహిల్స్ రోడ్డు నం.1, హైదరాబాద్ 4370.40
9. మార్వెల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రై.లిమిటెడ్ 153.98
10. సిలికాన్ బిల్డర్స్ కు చెందిన సర్వే నం.195లోని
భవనం, సర్వే నం.13/2లోని ఎకరా 30గుంటల స్థలం 906.50
11. సిలికాన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ ప్రై.లిమిటెడ్ 654.21
12. సండూర్ పవర్ కంపెనీకి చెందిన ఆస్తులు 11,849.71
13. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం ప్రాంతంలో
సర్వే నెం. 79/పీ, 80/2 లో 2500.69 గజాల స్థలం 136.91
14. మణికొండ ల్యాంకోహిల్స్ లోని ఫ్లాట్ నెం.902
(3654 ఎస్ ఎఫ్టీ) 130.23
15. కడప శెట్టిగుంట గ్రామంలో జెల్ల జగన్ మోహన్ రెడ్డి పేరు
మీద 27 ఎకరాలు 15.22
16. భారతీ సిమెంట్స్ లో వైఎస్ జగన్ పేరు మీద
(ఒక్కో షేర్)రూ.10 విలువ చేసే 2,38,06,435 షేర్లు 2380.64
17. భారతీ సిమెంట్స్ లో సిలికాన్ బిల్డర్స్ పేరు మీద
(ఒక్కో షేర్) రూ. 10 విలువ చేసే 1,50,00,000 షేర్లు 1500.00
18. సండూర్ పవర్ కంపెపీలో వైఎస్ జగన్ పేరు మీద
(ఒక్కో షేర్) రూ. 10 విలువ చేసే 1,66,44,083 8807.90
19. క్లాసిక్ రియాల్టీ కంపెనీలో వైఎస్ జగన్ పేరిట
ఒక్కో షేర్ రూ. 100 విలువ చేసే 88,103
ఈక్విటీ షేర్ లు 6500.00
20. సిలికాన్ బిల్డర్స్ సంస్థలో వైఎస్ జగన్ పేరు మీద ఒక్కో షేర్
ధర రూ.10 విలువ చేసే 2,58,181 ఈక్విటి షేర్ లు 286.00
21. సిలికాన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద
సండూర్ పవర్ కు చెందిన 2,08,50,000
కన్వర్టబుల్ ప్రిఫెరెన్స్ షేర్స్ 2085.00
22. సండూర్ పవర్ కంపెనీ పేరు మీద 124,500
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈక్విటీ షేర్ లు 982.60
23. సండూర్ పవర్ కంపెనీ పేరు మీద 105,000
ఎన్ ఎమ్ డీసీ లిమిటెడ్ ఈక్విటీ షేర్ లు 123.42
24. సండూర్ పవర్ కంపెనీ పేరు మీద 70,000 కైర్న్
ఇండియా లిమిటెడ్ ఈక్విటీ షేర్ లు 201.60
25. వైఎస్ భారతి పేరు మీద క్లాసిక్ రియాల్టీ ప్రై.లిమిటెడ్
6897 ఈక్విటీ షేర్ లు 510.11
26. భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రై.లిమిటెడ్ పేరు మీద
ఫిక్స్ డ్ డిపాజిట్ లు 15284.85
27. వైఎస్ భారతి రెడ్డి పేరు మీదున్న ఫిక్స్ డ్ డిపాజిట్ లు 1584.85
28. భగవతి సన్నిధి ఎస్టేట్స్ ప్రై.లిమిటెడ్ పేరు మీది ఫిక్స్ డ్
డిపాజిట్ లు 98.50
29. సిలికాన్ బిల్డర్స్ ప్రై.లిమిటెడ్ పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ లు 77.50
30. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రై.లిమిటెడ్ పేరు మీద
ఫిక్స్ డ్ డిపాజిట్ లు 49.56
మొత్తం విలువ 74910.42లక్షలు

English summary

ED attaches the assets of YSR Congresss party Chief Y.S.Jagan Mohan Reddy. Recently ED attached the News Channel Sakshi also.