ఎడిసన్ పురస్కారం 'ప్రణీత' వశం

Edison Award To Pranitha Subhash

10:00 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Edison Award To Pranitha Subhash

నల్గొండ జిల్లాలో రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై , సురక్షితంగా బయట పడిన హీరోయిన్ ప్రణీత సురక్షితంగా వుంది. ఆమె ప్రయాణించిన కారు బోల్తాపడడంతో అభిమానులు కలవరానికి గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన తరువాత ఆమె చెన్నైలో జరిగిన ఎడిసన్ పురస్కారాల ప్రదానోత్సవంలో హాజరైంది. సినిమా ఆవిర్భానికి కారణమైన థామస్‌ అల్వా ఎడిసన్ స్మారకార్థం ప్రతియేటా ఎడిసన్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రణీత షరా మామూలే అన్నట్లు, కలర్‌ఫుల్‌ కాస్ట్యూమ్స్‌తో చిరునవ్వులు చిందిస్తూ సందడి చేసేసింది. అంతేకాదు ప్రణీత ‘ఎడిసన్’ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఆమెతోపాటు లేటెస్ట్‌ క్రేజీ హీరోయిన్ కీర్తిసురేష్‌, నటులు జయంరవి, దర్శకులు రాజా, విఘ్నేష్‌ శివన్ తదితరులు ఈ పురస్కారాలతో తళుక్కు మన్నారు.

English summary

Heroine Pranitha Subash was awarded by Edison Award.She was famous in Tollywood by Attarintiki Daredi movie.Recently she missed an accident in Nalgonda District