నువ్వు చాలా హాట్ గా ఉన్నావు అంటూ సమంతను అన్నదెవరు?

Editor Latha Srinivasan hot comments on Samantha

05:59 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Editor Latha Srinivasan hot comments on Samantha

'జనతా గ్యారేజ్' సినిమాలో 'ఆపిల్ బ్యూటీ' సాంగ్ లో సమంతను చూసిన ఎవరైనా ఈ కామెంటే చేస్తారు. అంతేకాని ఇంత హాట్ కామెంట్ చేసింది ఎవరా? అని మాత్రం కంగారు పడిపోవద్దు. హాట్ హాట్ అందాలతో సమంత మగాళ్ల మతులు పోగొట్టింది. సమంత అందానికి మగాళ్లే కాదు.. ఆడాళ్లు కూడా ఫిదా అయిపోయారనడానికి సీనియర్ ఎడిటర్ లతా శ్రీనివాసనే నిదర్శనం. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరెకెక్కిన జనతా గ్యారేజ్ లో హీరోయిన్లుగా సమంత, నిత్యామీనన్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'దివి నుంచి దిగివొచ్చావా ఆపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ' అనే పాటలో ఎన్టీఆర్ సరసన సమంత స్టెప్పులేసింది.

పాటలో సమంత లుక్ ను, స్టయిల్ ను చూసిన లతా శ్రీనివాసన్ సమంతా.. ఆపిల్ బ్యూటీ సాంగ్ లో 'నువ్వు చాలా హాట్ హాట్ గా ఉన్నావ్. నీ లుక్ కూడా చాలా బాగుంది' అంటూ ట్వీట్ చేశారు. థ్యాంక్యూ సో మచ్ అంటూ ఆమె ట్వీట్ కు సమంత రీ ట్వీట్ చేసింది. ఇంకా నయం చైతు అనుకున్నాం అంటూ కొందరు కొంటెగా వ్యాఖ్యానించడం కొసమెరుపు.

English summary

Editor Latha Srinivasan hot comments on Samantha