వాయు కాలుష్యంతో రక్తనాళాలు మటాష్

Effects of Air Pollution on Red Blood Cells

11:53 AM ON 12th December, 2016 By Mirchi Vilas

Effects of Air Pollution on Red Blood Cells

కాలుష్యం అన్ని విధాలా పెరిగిపోతోంది. జల, వాయు,శబ్ద ఇలా పలురకాల కాలుష్యాలు మానవ జీవనాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఇందులో వాయుకాలుష్యం వూపిరితిత్తుల్లోని రక్తనాళాల్ని బలహీనపరుస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు.బెల్జియంలోని విశ్వవిద్యాలయ ఆస్పత్రి పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో భాగంగా 16 వేలకుపైగా వ్యక్తుల్ని పరిశీలించారు. అధిక కొలెస్ట్రాల్ వంటి సంప్రదాయ ముప్పు కారకాల్ని తగ్గించడంతోపాటు సురక్షిత పర్యావరణాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం సూచించింది. మనుషుల్లో శ్వాసకోశ రక్తనాళాల పనితీరుపై వాయుకాలుష్యం ప్రభావాన్ని పరిశీలించిన తొలి అధ్యయనం ఇదేనని బెల్జియంలోని విశ్వవిద్యాలయ ఆస్పత్రి పరిశోధకులు పేర్కొన్నారు. కాలుష్యం నిండిన పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంబంధించి ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. వాయుకాలుష్యం వూపిరితిత్తుల్లోని రక్తనాళాల్ని సంకోంచించుకునేలా చేస్తుందనీ, ఫలితంగా గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తస్మాత్ జాగ్రత్త అని సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఐటీ’ దెబ్బకు బాత్రూమ్ బద్దలైంది - ఇంతకీ అది ఓ అగ్ర హీరోది?

ఇది కూడా చూడండి: ఈ హీరోయిన్ కు విమానంలో కూడా లైంగిక వేధింపులు

English summary

Effects of Air Pollution on Red Blood Cells