విమానం కూలి -  69 మంది సజీవ సమాధే..

Egypt Flight Disappears In Over Mediterranean Sea

10:42 AM ON 20th May, 2016 By Mirchi Vilas

Egypt Flight Disappears In Over Mediterranean Sea

కొంత కాలంగా సర్వసాధారణంగా మారిపోతున్న విమాన ప్రమాదాల జాబితాలోకి మరొకటి చేరింది. దీంతో అంతర్జాతీయంగా పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఈజిప్టుకు చెందిన విమానం అదృశ్యమైంది. అది సముద్రంలో కూలిపోయినట్లు భావిస్తున్నారు. ఆ విమానంలో మొత్తం 69 మంది ఉన్నారు. ఇందులో 59 మంది ప్రయాణికులు కాగా..10 మంది విమాన సిబ్బంది. వీళ్లందరూ సజీవ సమాధి అయిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ప్రాన్స్ రాజధాని ప్యారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో కి బయల్దేరిన విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. రాడార్ సంకేతాలకు ఈ విమానం అందకుండా పోయింది. గ్రీక్ ద్వీపం సమీపనా సముంద్రంలో కూలిపోయినట్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:సెల్ఫీ దిగుతుంటే జారిన డ్రెస్

ప్యారిస్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కూడా విమానం కూలిపోయిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కూడా కూల్చివేసి ఉండొచ్చేమోనన్న అనుమానాల్ని కొట్టిపారేయలేమని ఆయన చెప్పడం గమనార్హం. విమానానికి ఏవియేషన్ సంస్థతో సంబంధాలు తెగిపోయే సమయానికి విమానం దాదాపు 32 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోందని అధికారులు తెలిపారు. విమానం కోసం మొత్తం మూడు దేశాల అధికారులు గాలింపులు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:తీవ్ర ప్రభావం చూపుతున్న ‘రోను’ తుపాను

English summary

An Egypt Flight disappears in Mediterranean sea with 59 passengers and 10 crew members.Paris President also responded on this incident that the flight was missed and he said that it might be blasted by terrorists also.