నాజూగ్గా, అందంగా లేరని 8 మంది యాంకర్లను పీకేసిన టీవీ ఛానల్!

Egypt tv channel suspended 8 anchors

06:16 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Egypt tv channel suspended 8 anchors

మాములుగా టీవీ యాంకర్లంటే ఎంతో అందంగా, నాజూగ్గా సినిమా హీరోయిన్ లెవెల్లో ఉంటారు. ఎందుకంటే వారు అందంగా ఉంటే వీక్షకులు పెరుగుతారు, యూత్ కూడా బాగా అట్ట్రాక్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ ఛానల్ కి టీఆర్పి రేటింగ్ కూడా బాగా పెరుగుతుంది. అయితే ఒక టీవీ ఛానల్ మాత్రం 8 మంది యాంకర్లను పీకి పడేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. స్థూలకాయం ఎంతటి చేటు చేస్తుందో ప్రస్తుతం ఓ టీవీ ఛానల్ యాంకర్లకు బాగా తెలిసొచ్చింది. టీవీలో కనిపించాలంటే నాజూగ్గా, అందంగా ఉండాలని, మీలాంటి వారిని చూడాలని ప్రజలనుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈజిప్టు ప్రభుత్వ ఛానల్ ఎనిమిది మంది మహిళా ఉద్యోగులను తొలగించింది.

నెల రోజుల్లో సన్నబడి నాజూగ్గా తయారైతేనే ఉద్యోగం ఉంటుందని కూడా తేల్చి చెప్పింది. ఈ విషయం తెలిసిన మహిళా సంఘాలు ఈజిప్షియన్ రేడియో అండ్ టెలివిజన్ యూనియన్(ఈఆర్టీయూ) తీరుపై భగ్గుమంటున్నాయి. మరోవైపు తమను ప్రజలు బాగానే ఆదరిస్తున్నారని, నిజంగా తాను లావుగా ఉన్నానో లేదో అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకోవాలని, సస్పెన్షన్ కు గురైన యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కావాలనే కక్షతో చేసిన పని అని ఓ యాంకర్ ఆరోపణలు చేసింది. టీవీ యాజమాన్యం చర్యలతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయారని మరో యాంకర్ తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ ఛానల్ తీరుపై ఉమెన్స్ సెంటర్ ఫర్ గైడెన్స్ అండ్ లీగల్ అవేర్ నెస్ ఛానల్ చర్యను ఖండిస్తూ.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈఆర్టీయూపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని సదరు ఛానల్ వెనక్కి తగ్గడం లేదు. వారు సన్నబడితేనే విధుల్లోకి తీసుకుంటామని స్పష్టంగా చెప్తోంది. లావుగా ఉన్న యాంకర్లను తొలగించడంపై ఇప్పుడు ఈజిప్టు టీవీ చానళ్లు పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ఈ ఘటనపై పార్లమెంటులోనూ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.

English summary

Egypt tv channel suspended 8 anchors