ఒకే రోజు తెలుగులో 8 సినిమాలు రిలీజ్‌

Eight Films To Release On This Friday

12:04 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Eight Films To Release On This Friday

ఈ నెల 26న అంటే శుక్రవారం ఒకేసారి తెలుగులో 8 సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అందులో 6 డైరెక్ట్‌ తెలుగు సినిమాలు కాగా, మరో 2 డబ్బింగ్‌ సినిమాలు. వీటిలో అడవి శేష్‌, ఆదాశర్మ, అనసూయ నటించిన థ్రిలర్ల్‌ సినిమా 'క్షణం' చిత్రం పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇకపోతే అక్కినేని నాగార్జున సపోర్ట్‌తో వస్తున్న 'పడేశావే' చిత్రం మరొక్కటి. ఈ రెండు చిత్రాలపై బాగా అంచనాలు ఉన్నాయి. ఇంక మిగతావి శ్రీకాంత్‌ నటించిన 'టైర్రర్‌', వెన్నెల కిషోర్‌ 'ఎలుకా మజాకా', కామెడీ తరహాలో తెరకెక్కిన 'వీరి వీరి గుమ్మడి పండు', హారర్‌ కామెడీ గా తెరకెక్కిన 'రాజుగారింట్లో ఏడవరోజు', ఇవన్నీ డైరెక్ట్‌ తెలుగు చిత్రాలు కాగా, మిగిలిన జయం రవి నటించిన తమిళం మూవీ జాంబీ తెలుగులో 'యమపాశం' పేరుతో విడుదలవుతుంది. ఇంకొకటి హాలీవుడ్‌ చిత్రం 'గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌' చిత్రం తెలుగులో డబ్‌ అయి వస్తుంది. ఈ ఎనిమిది చిత్రాలు ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి.

1/9 Pages

వీరి వీరి గుమ్మడి పండు

శివ కృతి క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు ఎం.వీ.సాగర్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో  రుద్రా , సంజయ్, వెన్నెల ,రఘుబాబు ,పోసాని కృష్ణ మురళి వంటి వారు నటించారు.

English summary

On this friday total Eight movies are going to release at box office.Anasuya,Adavi Shesh and Adah Sharma's Kshnam movie ,Padesave,Srikanth's Terror, Eluka Majaka, Rajugarintlo Edava Roju,Veeri Veeri Gummadi Pandu, Tamil dubbing movie ,Yamapasam,Hollywood dubbed movie God of Egypt were going to block the box office