ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతం

Eight maoists killed in Encounter in Khammam Forest Area

01:15 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Eight maoists killed in Encounter in Khammam Forest Area

ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్ ఇది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో 5గురు మహిళలు వున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దక్షిణ బస్తర్‌ ఏరియాలోని చింతవాడు అటవీప్రాంతం గొట్టెపాడు పరిసరాల్లో చర్ల మండలం కేంద్రం సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ బలగాలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్‌ సందర్భంగా మావోయిస్టులు తారస పడ్డారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో సుమారు 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 8 మంది మృతిచెందగా మిగిలిన వారు పరారయ్యారు. మృతుల్లో చర్ల మావోయిస్టు కమాండర్‌ లచ్చన్న కూడా ఉన్నాడు. సంఘటనా స్థలం నుంచి ఏకే 47, 6 ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు 303 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో హై ఎలెర్ట్ నెలకొంది.

English summary

Eight Maoists killed in an Encounter which has occurred in Telangana-Chattisgarh forest area near to Khammam.Police officials said that almost 30 maoists were participated in this encounter and 5 lady terrorists were killed out of 8 maoists .