మరణాంతరం ఆత్మ బరువు 21 గ్రాములేనట!

Ekkadiki Pothavu Chinnavada movie teaser

01:31 PM ON 17th October, 2016 By Mirchi Vilas

Ekkadiki Pothavu Chinnavada movie teaser

'మరణం దేహానికే కానీ ఆత్మకు కాదని భగవద్గీత చెబుతుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆత్మ 21 గ్రాముల బరువు. ప్రేమ..? సంతోషం..? పగ..? బాధ..? ఇవన్నీ కొలువై మరణానంతరం శరీరాన్ని విడిచి వెళ్లే ఆత్మ బరువు కేవలం 21 గ్రాములే'. దీన్ని ఆధారం చేసుకుని ఆత్మకు అర్థాన్ని చెప్పే ప్రయత్నంతో దర్శకుడు వి.ఐ.ఆనంద్. నిఖిల్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ టీజర్ శనివారం విడుదల చేశారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో హెబ్బాపటేల్, నందితా శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. మేఘనా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి స్వరాలు సమకూరుస్తున్నారు. నవంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

English summary

Ekkadiki Pothavu Chinnavada movie teaser