మందు బాటిల్‌తోనే ఎన్నికల ప్రచారం

Election Campaign With Alcohol Bottles

11:28 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Election Campaign With Alcohol Bottles

ఎన్నికలన్నాక ప్రచార శిబిరాల్లో వుండే వాళ్లకు బిర్యాని పెకేట్స్, రాత్రయితే మందు బాటిల్స్ సప్లయ్ చేస్తూ ఉంటారని , అందుకే అభ్యర్ధులకు ఖర్చు తడిసి మోపెడవుతుందని అంటారు. ఇక తమిళనాట ఎన్నికల ప్రచారంలో ఓ వింత ప్రచారం సాగుతోంది. అదేమిటో తెలుసుకుందాం. అంబత్తూరు శాసనసభ స్థానం నుంచి తమిళనాడు మదు కుడిప్పోర విళిపుణర్వు ఇయక్కం (తమిళనాడు మద్యం సేవన ప్రియుల అవగాహనా సంస్థ) తరపున కొరట్టూరుకు చెందిన ఎంఎస్‌ ఆరుముగం పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్నికల గుర్తు కూడా మద్యంసీసానే. ఇక ఈయన తన సంస్థకు చెందిన కార్యకర్తతో కలిసి ద్విచక్రవాహనంపై మద్యం సీసాను తలపై పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వాహనానికి కట్టిన ప్రచార ప్రకటన బోర్డులో విచిత్రమైన హామీలు ఇచ్చారు. 'మద్యం మహమ్మారికి భర్తను కోల్పోయిన మహిళలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మద్యం సేవించి తండ్రిని కోల్పోయిన పిల్లలకు 21 యేళ్ళ వరకు విద్య ఉపాధి ప్రాధాన్యత ఇవ్వాలి. మద్యం కారణంగా కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు నెలకు రూ.3 వేల నగదు సాయం చేయాలి, మద్యం బాధితుల కోసం అసెంబ్లీలో నిరంతరం పోరాడేందుకు, సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్ళేందుకు నన్నే ఎన్నుకోవాలి' అంటూ ఆయన విఙ్ఞప్తి చేస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. మందు బాటిల్ కి వోటేస్తే, మందు మరింత విచ్చలవిడి గా పారతుందని కొందరు ఛలోక్తులు విసురుతున్నారు.

ఇవి కూడా చదవండి:చెట్టును పెళ్లాడిన నటుడు

ఇవి కూడా చదవండి:'కబాలి' ని కొనలేక చేతులెత్తేసిన దిల్ రాజు

ఇవి కూడా చదవండి:రేపిస్ట్ నాలుక కొరికి తప్పించుకున్నయువతి

English summary

A Party in Tamilnadu was doing election campaign with Alcohol bottles . The Symbol of that party was also Alcohol and The demands of that party was also related to alcohol bottles.