పవర్ స్టార్ ఏ  గుర్తు కోరుకుంటారో...

Election Comission To Assign A New Symbol For Janasena

09:54 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Election Comission To Assign A New Symbol For Janasena

గడిచిన అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి - టిడిపి విజయానికి బాటలు వేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కీలకం కాబోతున్నారు. మళ్ళీ తమకోసం ప్రచారానికి రావాలని టీడీపీ-బీజేపీ కూటమి పవన్ ని ఇప్పటికే ఆహ్వానించాయి, అసలు ఈ ఎన్నికల్లో ముందుగా చెప్పినట్లు జనసేన నుంచి అభ్యర్ధులను నిలబెడతారా, కేవలం బిజెపి- టిడిపి కూటమి ప్రచారానికే పరిమితం అవుతారా అనేది పక్కన పెడితే, పార్టీ గుర్తుని కోరుకునే సమయం మాత్రం పవన్ కి ఆసన్నమైంది.

వివరాలలోకి వెళితే, తెలంగాణలో రాజకీయ పార్టీగా జనసేన గుర్తింపు పొందడం, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్-షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తదుపరి అడుగులు వేసింది. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీలో ఉన్న పార్టీల వారీగా వివరాలు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇంకా శాశ్వత గుర్తు పొందలేదు. ఫలితంగా తాజాగా తమ వద్ద ఉన్న ఫ్రీ సింబల్స్ లో నుంచి గుర్తును ఎంచుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు ప్రతిపాదించారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే మొత్తం 81 గుర్తులలో నుంచి ఏదైనా గుర్తును ఉంచుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. జనసేన తరహాలోనే మరో 71 పార్టీలు రాజకీయ గుర్తింపు పొంది గుర్తులు స్వీకరించకుండా ఉన్నాయి. వాటికి కూడా ఇదే తరహా ప్రతిపాదన పెట్టారు.

మిగిలిన పార్టీల మాట ఎలా వున్నా, అందరి దృష్టి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ మీదే వుంది. ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ-బీజేపీ నేతల ఆహ్వానం సంగతి పక్కన పెడితే ఇపుడు పవన్ ను రాష్ర్ట ఎన్నికల సంఘం పిలిచి, గుర్తు కోరుకోమనడంతో జనసేన ఏ గుర్తుని కోరుకుంటుంది అనేది చర్చకు దారితీసింది. గతంలో మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు రైలు ఇంజన్ గుర్తు తెచ్చుకున్నారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆ తర్వాత సూర్యుడు గుర్తు మార్చుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని మూసేసి , కాంగ్రెస్ లో కలిపేసారు.

ఈవన్నీ గతం ... ఇప్పుడు చాలామందికి పవన్ మీద గురి వుంది. అలాంటప్పుడు జనంలోకి దూసుకుపోయేందుకు పవన్ ఎలాంటి గుర్తుని తెచ్చుకుంటారో చూడాలి. మరో పక్క గ్రేటర్ ఎన్నికల మాటల యుద్ధం స్టార్ట్ అయిపొయింది. సీమాంధ్ర ఓట్లు పొందేందుకు పవన్ కళ్యాణ్ ను బీజేపీ-టీడీపీ నేతలు ప్రచారానికి పిలుస్తున్నారంటూ సిఎమ్ కెసిఆర్ కూతురు , ఎంపి కవిత కామెంట్లు కూడా చేశారు. మరి పవన్ గుర్తు తో పాటూ, ఎలాంటి వ్యూహం తో అడుగులు వేస్తారో మరి.

English summary

Election Comission to assign a new party symbol for pawan kalyan's political party Janasena.