ఒవైసి కి షాకిచ్చిన ఎన్నికల కమీషన్

Election Commision Give Shock To Asaduddin Owaisi

11:01 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Election Commision Give Shock To Asaduddin Owaisi

ఈ మధ్య వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకు ఎక్కుతున్న అసదుద్దీన్ ఒవైసి కి గట్టి షాక్ తగిలింది. ఈయన నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ త్వరలో జరుగబోయే మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీచేయకుండా ఎలక్షన్ కమిషన్ నిషేధం విధిస్తూ, షాకిచ్చింది. నిర్ణీత గడువులోగా పార్టీ ఆదాయ వ్యయాల ఆడిట్ నివేదిక సమర్పించకపోవడంతో ఈసీ ఈ చర్య తీసుకుంది. గతంలోనే ఆడిట్ నివేదిక సమర్పించాలని ఎంఐఎంను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఆడిట్ నివేదిక సమర్పించకపోతే మహారాష్ట్రలో రాజకీయ పార్టీగా ఎంఐఎంను రిజిస్ట్రేషన్ ను రద్దుచేస్తామని కూడా హెచ్చరించింది. అయినా పార్టీ లైట్ తీసుకోవడంతో ఈసీ కొరడా ఝులిపించింది.

దీంతో ఆపార్టీ నేతలు పార్టీ గుర్తుపై స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. అయితే, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, 2015లో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన ఎంఐఎం మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ఔరంగాబాద్ మున్సిపాలిటీలో 24 స్థానాలు సాధించి.. ప్రధాన ప్రతిపక్షంగా ఎంఐఎం సత్తాచాటింది. మొత్తానికి ఎన్నికల కమీషన్ నిర్ణయంతో ఎంఐఎం కి పెద్ద చిక్కొచ్చి పడిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:చిరు సరసన విజయ శాంతి

ఇవి కూడా చదవండి:సన్నీ కండోమ్ యాడ్ లో అందుకే నటిస్తుందట!

English summary

Election Commission gave big shock to MIM Party in Mahrashtra. MIM Party taken light of the notices of election Commission and election commission have banned MIM Party for next elections in Maharashtra.