షాకింగ్ న్యూస్: సైకిలు గుర్తు ఉండదా?

Election Commission of India Now Holds The Key to Samajwadi Party Cycle

11:22 AM ON 3rd January, 2017 By Mirchi Vilas

Election Commission of India Now Holds The Key to Samajwadi Party Cycle

సైకిలు గుర్తు అంటే దానికో క్రేజ్ వుంది. 1982లో ఎన్. టీ. ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సైకిలు గుర్తు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆంద్ర దేశంలో సైకిల్ ప్రభంజనం సృష్టించింది. అదే రీతిలో యుపిలో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ ను ఎంచుకుంది. అక్కడ కూడా ఆపార్టీ గెలిచింది. కానీ సైకిల్ గుర్తుని కొద్ది రోజులు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఖురేషి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాదండి బాబూ.. యుపిలో ... అవును సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఓ పక్క పార్టీ వ్యవస్థాపకుడు ములాయం , మరోపక్క ఆయన కుమారుడు అయిన సీఎం అఖిలేష్ ఎవరికి వారే సైకిలు గుర్తు తమదంటే తమదని అంటున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది .

ఈ నేపథ్యంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఖురేషి మాట్లాడుతూ, 'సాధారణంగా ఇలాంటి పరిస్థితలు నెలకొన్న సమయంలో ఇరు వర్గాలకు చెందిన వారు అఫిడవిట్లు, ఆధారాలు సమర్పించాలి. తమ మద్దతు దారుల సంతకాలు సేకరించి దానిని కూడా ఎన్నికల సంఘానికి ఇస్తే మెజారిటీ ఎటు ఉంటే ఆ వర్గానికి చిహ్నాన్ని కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ముగియటానికి నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. అయితే గతంలో నేనెప్పుడు యుపిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూడలేదు. ఇరు వర్గాలకు మద్దతు ఎక్కువగానే ఉంది. ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘం కొంత కాలం ఈ గుర్తును ఎవ్వరికి కేటాయించకుండా ఇరు వర్గాలకు కొత్త గుర్తులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే కనుక జరిగితే, సమాజ్ వాదీ పార్టీకి కష్టమే మరి. ఇంతకీ ఏం జరుగుతుందో చూడాలి.

ఇది కూడా చూడండి: ఇవన్నీ అబద్ధాలే ... 2016 లో చక్కర్లు కొట్టిన ఘటనలు

ఇది కూడా చూడండి: జనవరి 27న మాట్లాడారో ఇక అంతే

English summary

Election Commission of India Now Holds The Key to Samajwadi Party Cycle