ఎలక్ట్రిక్ బాత్ చేస్తే ఒళ్ళు నొప్పులు మటుమాయం...

Electric bath is best for body pains

01:17 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Electric bath is best for body pains

స్నానం చేయడం అంటే ఎదో నాలుగు చెంబులు నీళ్లు కుమ్మరించుకోవడం కాదు... నిజానికి స్నానం చేయడం కూడా ఓ కళే. షవర్ బాత్, సన్ బాత్, స్టీమ్ బాత్... ఇలా రకరకాల స్నానాలు వున్నాయి కదా. అయితే కొత్తగా ఇంకోటి వచ్చింది. అదే ఎలక్ట్రిక్ బాత్. ఇంతకీ ఈ ఎలక్ట్రిక్ బాత్ ఏంటీ అనుకుంటున్నారా? మనకైతే కొత్త గానీ జపాన్ లో చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బాత్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వినడానికి విచిత్రంగా ఉన్న, వీటిలో స్నానం చేస్తే చాలా వరకు ఒళ్లు నొప్పులు మాయమవుతాయట. ఇందుకోసం, స్నానం చేసే టబ్ లోకి తక్కువ స్థాయిలో విద్యుత్ ప్రసరించేలా చేస్తారు. ఇందులో దిగి స్నానం చేస్తే, తేలికపాటి విద్యుత్ షాక్ శరీరానికి తగిలి కండరాల్లో కరెంట్ ప్రసరించి నొప్పి తగ్గిపోతుందట.

కీళ్లనొప్పులు, స్పాండిలైటిస్ కూడా తగ్గిపోతాయని జపనీయులు అంటున్నారు. దీన్నే వైద్య పరిభాషలో ఎలక్ట్రోథెరపీ అని పిలుస్తారు. ప్రస్తుతం జపాన్ లో ఈ స్నానాలకు బాగానే డిమాండ్ ఉంది. మొదటిసారిగా ఈ పద్ధతిని లండన్ లోని ఓ ఆసుపత్రిలో 1767 సంవత్సరంలో ఉపయోగించారు. అమెరికాలో 1940లో గాయపడ్డ సైనికులకు చికిత్స అందించేందుకు, కండరాల్లో బలాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ థెరపీని ఉపయోగించారు.

అలాగే, క్యాన్సర్ ను నయం చేసేందుకు కూడా ఎలక్ట్రోథెరపీ ద్వారా చికిత్స చేసినట్లు 1985లో క్యాన్సర్ జర్నల్ రీసెర్చ్ లో ప్రచురించారు. ఎలక్ట్రోథెరపీ చేస్తున్నప్పుడు విద్యుత్ నుంచి వచ్చే ఎలక్ట్రోడ్ లు గాయపడ్డ ప్రాంతంలో నరాలను ఉత్తేజపరిచి ఆ సిగ్నల్స్ ను మొదడుకు పంపి గాయపడ్డ ప్రాంతంలో నొప్పి తగ్గిపోయేలా చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇక ఈ ఎలక్ట్రోడ్ ల వల్ల శరీరంలో సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ ఎండోర్ఫిన్స్ ను విడుదల చేసి నొప్పి నివారిస్తాయన్న మరో వాదన కూడా ఉంది.

ఇది కూడా చదవండి: తాను చనిపోతూ 10 మంది ప్రాణాలు కాపాడిన 'బొబ్బా స్నేహామృత'

ఇది కూడా చదవండి: అమ్మాయిలతో చిందులేస్తూ అడ్డంగా దొరికేసిన వైసీపీ కార్యకర్తలు!

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

English summary

Electric bath is best for body pains