కరెంట్ వెహికల్స్ కోసం ఎలక్ట్రిక్ రోడ్ వీడియో

Electric road in Sweden

12:06 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Electric road in Sweden

అవునా, ఎలక్ట్రిక్ ట్రైన్ చూస్తున్నాం. కానీ అక్కడ ఏకంగా ఎలక్ట్రిక్ రోడ్డు ఉంది. నిజానికి ఏ వాహనమైనా రహదారులపై దూసుకెళ్లాలంటే ఇంధనంగా పెట్రోల్ .. డీజిల్ లేదంటే గ్యాస్ వాడి తీరాలి. అయితే ఈ సాంకేతిక యుగంలో వస్తున్న మార్పుల పుణ్యమా అని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వచ్చేశాయి. అయితే.. వీటిని మిగితా వాహనాల్లా ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ చేసుకునే సదుపాయం లేకపోవడం ఓ మైనస్. కానీ భవిష్యత్ లో పెట్రోల్ .. డీజిల్ నే కాదు అసలు ఛార్జింగ్ కూడా అవసరం లేకుండా రహదారిపై దూసుకెళ్ల గల పరిస్థితులు వస్తేస్తాయి. ఇదేదో అబద్ధమో , మరొకటో కానీ కాదు. నిజం ఎందుకంటే, స్వీడన్ లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి 2030 నాటికి పూర్తి అందుబాటులోకి తేవాలని స్వీడన్ యోచిస్తోంది. అంతేకాకుండా అడుగంటుతున్న ఇంధన వనరుల్ని పొదుపుగా ఉపయోగించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇలాంటి ఆవిష్కరణలు ఉపయోగపడతాయని భావిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే,

బొగ్గు.. డీజిల్ తో నడిచే రైళ్ల కన్నా విద్యుత్ తో నడిచే రైళ్ల వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు వేగంగా వెళ్లగలుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్వీడన్ లో ఈ ఎలక్ట్రిక్ రహదారులను రూపొందిస్తున్నారు. రైల్వే ట్రాక్ లపై ఏ విధంగా అయితే.. విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారో అదేవిధంగా రహదారులకు ఇరువైపులా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి వాహనాలను అనుసంధానించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు విద్యుత్ లైన్ నుంచి బయటకు వచ్చినా.. ముందున్న వాహనాలను అధిగమించాలన్నా బ్యాటరీ లేదా ఇంధనం సాయంతో వాహనాన్ని నడపవచ్చు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ ను కూడా ఇప్పటికే పరీక్షించారు. బయోఫ్యూయల్ తో నడిచే యూరో-6 గుర్తింపు పొందిన స్కానియా ట్రక్స్ ద్వారా ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. మరి మనదేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాలి.

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు పంపే 4 సూచనలు ఇవే!

ఇది కూడా చూడండి: వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి: తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడుందంటే...

English summary

Electric road in Sweden. In Sweden two electric roads tests for heavy trucks.