అమ్మా.. లే.. అంటూ కంట తడి పెట్టిస్తున్న పిల్ల ఏనుగు

Elephant getting tears for his mother Elephant

01:17 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Elephant getting tears for his mother Elephant

కన్న పేగు బంధం ఎక్కడైనా ఒకటే కదా. మనిషి అయినా జంతువు అయినా, పక్షులు అయినా తల్లితో అనుబంధం ఒకే విధంగా ఉంటుంది. మనుషులకన్నా జంతువులలోనే ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఈ దృశ్యం చూస్తే, మనకూ కన్నీరు వస్తుంది. అడవుల్లో మరణించి పడి ఉన్న తల్లి ఏనుగు ముందు పిల్ల ఏనుగు సాగిల పడి లేవమన్నట్లు తన తొండంతో తట్టి లేపుతున్న ఈ చిత్రం జంతుప్రేమికులనే కాదు సగటు మనుషుల గుండెలను పిండేసింది. తమిళనాడు రాష్ట్రంలోని అడవుల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకూ చిత్రం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ పరిధిలోని బోలువాంపట్టి రేంజ్ లో ఓ తల్లి ఏనుగు సంచరిస్తూ కిందపడి మరణించింది. దీంతో పిల్ల ఏనుగు వచ్చి అరుస్తూ చచ్చిపడి ఉన్న తల్లి ఏనుగును తట్టి లేపింది. ఈ పిల్ల ఏనుగు చిత్రం జంతు ప్రేమికులను కలచివేసింది. పర్యావరణ సమతౌల్యం లోపించడం వల్లనే అడవుల్లో ఏనుగులు గ్రామీణ ప్రాంతాలకు సమీపంలోకి వలస వస్తున్నాయని అటవీ అధికారులు అంటున్నారు. ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులకు పరిరక్షించేందుకు తాము చర్యలు చేపడుతున్నామని కన్సర్వేటర్ పేర్కొన్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్, బయాలజిస్ట్ రామన్ సుకుమార్ అంచనా ప్రకారం తమిళనాడు అడవుల్లో ఏనుగులు సహజసిద్ధమైన కారణాలతోనే మరణిస్తున్నాయట.

2012 గణాంకాల ప్రకారం తమిళనాడు అడవుల్లో 4000 ఏనుగులున్నాయని, కాగా వీటిలో వయసు మీరటం, వ్యాధుల వల్ల 50కి పైగా ఏనుగులు మరణించాయని సుకుమార్ వివరించారు. 2015వ సంవత్సరంలో కరవు పరిస్థితుల వల్ల వన్యప్రాణులకు తాగటానికి నీరు లేక కరవు బారిన పడి మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు.. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవుల్లో చెత్తను డంపింగ్ చేస్తుండటం కూడా ఈ ఏనుగులతో పాటు వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని సుకుమార్ వివరించారు. కారణాలేవైనా ఏనుగులతో పాటు వన్యప్రాణులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జంతు ప్రేమికులు అంటున్నారు. ఆ దిశగా అందరూ అడుగులు వేయాల్సి ఉంది.

English summary

Elephant getting tears for his mother Elephant