పొంచివున్న ఎల్నినో జలగండం - ముందస్తు చర్యలు చేపట్టేనా ?

Elnino To Hit South India

11:21 AM ON 12th December, 2015 By Mirchi Vilas

Elnino To Hit South India

ఆ మధ్య హుదూద్ తుపాన్ తో విశాఖ తీవ్రంగా నష్టపోగా , ఇటీవల అల్పపీడనం కారణంగా విస్తారంగా కురిసిన వర్షాలకు తమిళనాడు , ముఖ్యంగా చెన్నై అతలాకుతల మైంది. ఎపిలో చిత్తూరు , నెల్లూరు , ప్రకాశం, కడప , కర్నూల్, గోదావరి తదితర జిల్లాల్లో నష్టం ఏర్పడింది. పంట చేతికందే సమయంలో కురిసిన వర్షంతో రైతులు కుదేలయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితులు వస్తాన్నాయను కుంటే , తాజాగా ఎల్ నినో(వాతావరణ మార్పు ) కారణంగా ఫిబ్రవరి వరకు వరదలగండం దక్షిణ భారతానికి పొంచివుందన్న వార్తలు వణికికిస్తున్నాయి .

ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా దక్షిణ భారత దేశంలో వర్షాలు విపరీతంగా కురిసి , వరదలు ముంచెత్త నున్నాయని అంటున్నారు. ఐక్య రాజ్య సమితి ఈ మేరకు స్పష్టమైన హెచ్చరిక జారీచేసింది. ఐక్య రాజ్య సమితి ఆసియా -పసిఫిక్ ఆర్ధిక సామాజిక ,కమిషన్ , ఆసియా - ఆఫ్రికా ప్రాంతీయ బహుళ విధ విపత్తుల సమీకృత హెచ్చరిక సహకార వ్యవస్థ (రిమేస్ ) సంయుక్తంగా అందజేసిన నివేదిక ప్రకారం ఈ హెచ్చరిక జారియింది. ఇండోనేషియా ఈశాన్య ప్రాంతం తో సహా , ఫిలిప్పీన్స్ , ధాయ్ లాండ్ , కొలంబియా , లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా చూపిస్తుందని నివేదిక లో స్పష్టంగా పేర్కొన్నట్లు చెబుతున్నారు.

అధ్యయనానికి సంభందించి ,1997-98 నుంచి 2015 -16ఫిబ్రవరి వరకు వాతావరణ సరళిని పరిశీలిస్తే , ఆసియా , ఫసిపిక్ , ప్రాంతంపై గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎల్ నినో ప్రభావం అత్యంత తీవ్రంగా వుందట. విపత్తుల నివారణకు ప్రాంతీయ సహకారంతో పాటూ , విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొన దానికి సీజనల్ వ్యూహం , దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.

గతం కంటే 2016- ఎల్ నినో ప్రభావం భీభత్సంగా వుండే ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎల్ నినో జలగండం పొంచివుందన్న అంశంతో ఫిబ్రవరి వరకూ మాల్దీవులు , శ్రీలంక , దక్షిణ భారత్ లలో కుండపోత వర్షాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 21.7 అంగుళాల వర్షపాతం కురిసిన కారణంగా చెన్నై మహానగరం అతలాకుతల మైందని, పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని , భారీ నష్టం వాటిల్లిందని నిపుణులు ప్రస్తావించారు.

ఎల్నినో ప్రభావం తో కురిసే వర్హాలకు ప్రజలు , ఆస్తులు జలగండం బారిన పడకుండా ముందస్తు గా ప్రభుత్వం , సంస్థలు ఎలాంటి చర్యలు చేపదతాయో , ప్రజల్లో ఎలాంటి చైతన్యం తెస్తాయో ....

English summary

UNO said that the Elnino cycloe no hit hard in south India.Recently Chennai Had soo much loss due top heavy rains and floods.