ఏలూరు ఎంపీ గన్‌మెన్‌ ఆత్మహత్య

Eluru MP Gunman Sucide

11:07 AM ON 22nd December, 2015 By Mirchi Vilas

Eluru MP Gunman Sucide

టిడిపి సీనియర్‌ లీడర్‌, ఏలూరు పార్లమెంట్‌ సభ్యులు మాగంటి బాబు గన్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

చాలా సంవత్సరాలగా మాగంటి బాబు వద్ద పనిచేస్తున్న ఆదాం కు 45 సంవత్సరాలు. మాగంటి బాబు పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఢిల్లీ వెళ్ళారు . ఈ క్రమంలో ఆదాం సోమవారం తన ఇంటి దగ్గర పురుగుల మందు తాగాడు. దీన్ని గమనించిన అతని కుటుంబ సభ్యులు వెంటనే హాస్పటల్‌ కు తరలించగా చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే ఆదాం చనిపోయాడు. ప్రస్తుతం ఆదాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు గవర్నమెంట్‌ ఆసుపత్రికి తరలించారు.

మాగంటి బాబు ఊరిలో లేని సమయంలో ఇలా జరగడంతో ఈ విషయం చర్చనియాంశంగా మారింది. ఆదాం మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆదాం ఆత్మహత్యకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary

Eluru MP Magantibabu gunman Adaam sucide today by taking poison. He was rushed to hospital for hospital but he died.Police filed as case in this incident and investigating for the reasons behind his sucide