ఈ మెయిల్ సృష్టి కర్త కన్నుమూత

Email inventor Ray Tomlinson dies

12:34 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Email inventor Ray Tomlinson dies

ఈ-మెయిల్‌ రూపలక్పనతో ప్రపంచగతినే మార్చివేసిన రే టామ్లిసన్‌ ఇక లేరు. శనివారం ఈయన గుండెపోటుతో మరణించినట్టు చెబుతున్నారు. ఈయన వయస్సు 74 సంవత్సరాలు. కేంబ్రిడ్జిలోని బీబీఎన్‌ టెక్నాలజీ అనే కంపెనీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. మరణించే సమయానికి ఆయన ఎక్కడ ఉన్నారో, మరణానికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. 1971లోనే ఈయన ఒక మెషీన్‌ నుంచి మరో మెషీన్‌కు ఎలక్ట్రానిక్‌ మెసేజ్‌ పంపించారు. ఈ-మెయిల్‌ అడ్రస్‌లో @ గుర్తును కూడా మొదట ఈయనే ఉపయోగించారు. తొలి రోజుల్లో టామ్లిసన్‌ ఆర్పానెట్‌ ద్వారా మొదటి ఈ-మెయిల్‌ పంపించారు. బోస్టన్‌లో ఈయన రీసెర్చి ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పుడు మొదటి మెయిల్‌ పంపారట. అయితే ఆ మెయిల్‌ ఏం రాశారు అనే విషయం తనకు గుర్తులేదని, అది పూర్తిగా మర్చిపోదగిన విషయం అని టామ్లిసన్‌ గతంలో వెల్లడించారు.

ఇంటర్నెట్‌ నిర్మాణానికి టామ్లిసన్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఈయన సేవలు ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని మార్చేశాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థలోనే ఈ-మెయిల్‌ ఓ నూతన శకానికి నాంది పలికింది. ఇంటర్నెట్‌ వ్యాప్తికి టామ్లిసన్‌ చేసిన కృషికి, ఈయనకు 2012లో ‘ఇంటర్నెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’గా గుర్తింపు లభించింది.

English summary

Email inventor and selector of "@" symbol Ray Tomlinson dies at the age of 74.Tech world along with gmail also Condolence on Ray Tomlinson Death.