కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ

Emergency In California

05:18 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Emergency In California

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పెద్ద ఎత్తున గ్యాస్‌ లీకవుతుండటంతో స్థానిక ప్రజల కోరిక మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ జెర్రీ బ్రౌన్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లాస్‌ఏంజెల్స్‌లోని పోర్టర్‌ రాంచ్‌ ప్రాంతంలోని భూగర్భ స్టోరేజీ నుంచి చాలా రోజులుగా గ్యాస్‌ బయటకి వస్తోందని చెప్పారు. అక్కడున్న గ్యాస్‌ బావి సదరన్‌ కాలిఫోర్నియా గ్యాస్‌ కంపెనీ అధీనంలో ఉందని చెప్పారు. దాని నుంచి రోజూ ఇతర వాయువులతో పాటు 1,200 టన్నుల మీథేన్‌ లీకవుతోందన్నారు. గత అక్టోబరులో లీకేజీని గుర్తించామని, ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అక్కడి నుంచి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఖర్చును సంస్థ భరిస్తోందని గవర్నర్‌ తెలిపారు. గ్యాస్‌లీక్‌ వల్ల స్థానికులు చాలామంది అస్వస్థులయ్యారని, ముక్కు నుంచి రక్తం కారడం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారని చెప్పారు. ఈ పరిస్థితుల దృష్ట్యా లాస్‌ఏంజెల్స్‌ కౌంటీ, లాస్‌ఏంజెల్స్‌ స్కూల్‌ బోర్డ్‌లు ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించగా తాజాగా తాము స్టేట్‌ ఎమర్జెన్సీ ప్రకటించామని చెప్పారు. లీకేజీని ఆపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు

English summary

California Governer Jerry Brown declared a state of emergency Wednesday due to methane gas leak