ముద్దులు ఎలా పెట్టుకోవాలో పుస్తకం రాస్తా..

Emraan Hashmi want to write The Kiss of Life book

03:32 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Emraan Hashmi want to write The Kiss of Life book

ఇమ్రాన్‌ హష్మీ సినిమాల్లో ప్రధానంగా ఆకర్షించేవి అదర చుంబన సన్నివేశాలే. ఆయన సినిమాలు ఎలా ఉన్నా.. ఇమ్రాన్‌ నటించే చాలా సినిమాల్లో ముద్దు సన్నివేశాలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అందుకే ఆయన్ను బీటౌన్‌లో సీరియల్‌ కిస్సర్‌ అంటారు. తాజాగా ఈ సీరియల్‌ కిస్సర్‌.. ముద్దులు ఎలా పెట్టాలో వివరించే పుస్తకం రాయబోతున్నాడట. ఇప్పటికే.. తన కుమారుడు అయాన్‌ క్యాన్సర్‌ చికిత్స సమయంలో తాను పడ్డ ఆవేదన.. ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇమ్రాన్‌ ‘ది కిస్‌ ఆఫ్‌ లైఫ్‌’ పుస్తకాన్ని రచించి విడుదల చేశాడు. తాజాగా ముద్దుల పై కూడా ఓ పుస్తకాన్ని రాస్తానంటున్నాడు. అందుకోసం..

ప్రత్యేకంగా రచనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ‘పుస్తకం రచించాలన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకా మొదలు పెట్టలేదు. ప్రస్తుతం నేను ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉన్నాను. నాకు తెలిసి మార్కెట్లో ఇలాంటి అంశం పై పుస్తకాలు ఏమీ లేవు. కాబట్టి కచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పుస్తకం రాయలని భావిస్తున్నాని' అన్నాడు. వెండితెర పై ముద్దుల వర్షం కురిపించే ఇమ్రానే వాటి పై పుస్తకం రాస్తే.. అవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయమంటున్నారు సినీ వర్గాలు.

English summary

Emraan Hashmi want to write The Kiss of Life book. Bollywood serial kisser Emraan Hashmi want to write book on kisses.