రాజయ్య రాజకీయ శకం ముగిసినట్టే

End Of Rajayya’s Political Era

06:40 PM ON 7th November, 2015 By Mirchi Vilas

End Of Rajayya’s Political Era

కోడలు , మనవల సజీవ దహనం కేసులో మాజీ ఎంపి సిరిసిల్ల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్దిగా సీటు దక్కించుకున్న రాజయ్య తీరా నామినేషన్ వేసే రోజు వచ్చేసరికి అనుకోని చిక్కుల్లో పడ్డారు . ఎన్నాళ్ళ నుంచో ఆ ఇంట్లో కోడలు సారికతో వివాదం నెలకొని వుంది. రాజయ్య కొడుకు అనిల్ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని ఆరోపణ. రాజయ్య పొద్దున్న నామినేషన్ వేయాల్సి వుంటే , అర్దారాత్రి జరిగిన ఘోర దుర్ఘటనతో పరిస్థితి తారుమారైంది . సారిక , ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. అనుమానస్పద మరణం కింద కేసు నమోదు చేసినా , సారిక కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు రాజయ్య , అతని భార్య , కుమారుడు లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు . మరోపక్క మహిళా సంఘాలు ఈ ఘటనపై సీరియస్ గా స్పందిస్తూ , కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి . ఇందుకోసం ఆందోళన బాట పట్టాయి . అయితే కోడలు , మనవల సజీవ దహనం నేపధ్యంలో తనకు టికెట్ వద్దని రాజయ్య చెప్పడంతో మల్కాజ్ గిరి మాజీ ఎంపి సర్వే సత్యనారాయణను అభ్యర్ధిగా కాంగ్రెస్ ప్రకటించడం , ఆయన నామినేషన్ వేయడం చకచకా జరిగిపోయాయి.

వేధింపుల వల్లే సారిక తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న తరుణంలో రాజయ్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది రాకుడదన్న అంచనాకు ఆ పార్టీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది . .రాజయ్య పై వేటు వేయాలని , తద్వారా గట్టి సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు భోగట్టా . వేటు వేయడం వలన పార్టీ పై వ్యతిరేక ప్రభావం ఏమైనా ఉంటుందా అనే కోణంలో కూడా ఆపార్టీ కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే ఆరా తీసి , వేటు వేయడం పై ఒక అంచనాకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది . వేటు పడితే ఇక రాజయ్య రాజకీయ శకం ముగిసినట్టేనన్న మాటలు వినిపిస్తున్నాయి . అసలు ఈపాటికి ఎన్నికల ప్రచారంలో ఎడతెరిపి లేకుండా బిజీ గా ఉండాల్సిన రాజయ్య విషాదం చుట్టుముట్టేసింది. ఏం జరుగుతుందో చూద్దాం .

English summary

End Of Rajayya’s Political Era