ఇండియా ఓడిపోయిందని గ్వాలియర్ విధ్యార్ధిని ఆత్మహత్య!

Engineering girl commits for losing India in world cup semi final

03:37 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Engineering girl commits for losing India in world cup semi final

మార్చి 31న ఇండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఇండియా ఘోర పరాజయం పాలయిందన్న విషయం తెలిసిందే. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసిన ఇండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో ఇండియా తప్పుకుండా గెలుస్తుందని అభిమానులు ఎంతో ఆశించారు, కానీ మ్యాచ్ ఓడిపోవడంతో అభిమానులు ధన్ని జీర్ణించుకోలేకపోయారు. అంత భారీ స్కోర్ చేసినా గెలవలేదని బాధ పడ్డారు, ఆ తరువాత తమలో తామే సర్ధి చెప్పుకున్నారు. ఆటలో ఇది సహజమే అని ఊరుకున్నారు. అయితే గ్వాలియర్ కి చెందిన అమ్మాయి మాత్రం అలా చెయ్యలేదు, ఇండియా ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

అసలు విషయంలోకి వెళ్తే గ్వాలియర్ కి చెందిన ఓ బీటెక్ విధ్యార్ధిని ఇండియా ఓడిపోయిందని ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆమె తల్లిదండ్రులని విచారించగా... ఇండియా గెలవడానికి ఆమె చాలా ప్రార్ధించిందని, పూజలు కూడా చేసిందని తెలిపారు. ఇంక ఓడిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక చనిపోయిందని చెప్పారు. అయితే ఇక్కడ అనుమానించ వల్సిన విషయం ఏమిటంటే ఆమె చనిపోతున్నప్పుడు ఎటువంటి సూసైడ్ నోటు రాయకపోవడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఇండియా ఓడిపోయినందుకే చనిపోయిందా? లేక వేరే ఏదైనా కారణామా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English summary

Engineering girl commits for losing India in world cup semi final. Gwalior Engineering girl commits suicide for India losing in semi final.