డర్బన్ టెస్ట్ సఫారీలు చిత్తు..

England beat South Africa in first Test

05:15 PM ON 30th December, 2015 By Mirchi Vilas

England beat South Africa in first Test

టీమిండియాలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన సౌతాఫ్రికాకు ఇంకా టైమ్ కలసి రావడం లేదు. దక్షిణాఫ్రికా తన సొంత దేశంలోనే దారుణంగా ఓడిపోయింది. అది కూడా తమకు బాగా అచ్చొచ్చిన డర్బన్ మైదానంలో చిత్తయ్యింది. అయిదు టెస్ట్ సిరీస్ కోసం ద‌క్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ కు శుభారంభం ల‌భించింది. డ‌ర్బ‌న్ లో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 241 ప‌రుగుల భారీ తేడాతో స‌ఫారీల‌ను చిత్తు చేసి 1-0తో ముందంజ‌లో ఉంది. ఇంగ్లండ్తో తొలి టెస్టు చివరి రోజు బుధవారం 416 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 174 పరుగులకే కుప్ప‌కూలి ఓట‌మిపాల‌యింది. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ నాలుగు, అలీ మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ ఎల్గర్ 40 ప‌రుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 303 పరుగులు,రెండో ఇన్నింగ్స్ లో 326 పరుగులు చసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 174 ప‌రుగులకే చాప చుట్టేసింది.

English summary

England beat South Africa in first Test in Durban by 241 runs.