20 బంతులు.. 0 పరుగులు.. 10 వికెట్లు

English team All out for 0 Runs

11:15 AM ON 13th February, 2016 By Mirchi Vilas

English team All out for 0 Runs

సున్నా పరుగులకే పది వికెట్లు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంగ్లండ్ లోకల్ క్రికెట్ మ్యాచ్ లో ఈ గణాంకాలు నమోదయ్యాయి. కెంట్‌ ఇండోర్‌ క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో జట్టులోని ఆటగాళ్లు అందరూ ఖాతా తెరవకుండానే డకౌట్‌గా పెవిలియన్‌ చేరారు. ఆరుగురు క్రికెటర్లు టీమ్ గా పోటీపడిన ఇండోర్‌ నేషనల్‌ క్లబ్‌ ఛాంపియన్‌ షిప్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్రైస్ట్‌చర్చ్‌ వర్సిటీ నిర్ణీత 12 ఓవర్లలో 120 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆటగాళ్లు వరుసగా 26, 29, 10, 11, 13 పరుగులు చేయగా.. ఎక్స్ ట్రాల రూపంలో మరో 31 పరుగులొచ్చాయి. దీంతో 121 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు బాప్‌చైల్డ్‌ క్రికెట్‌ క్లబ్‌కు నిర్దేశించింది. లక్ష్య ఛేదనను ఆరంభించిన బాప్‌చైల్డ్‌ జట్టు స్కోరు బోర్డుపై ఒక పరుగైనా చేరకముందే 3.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి ప్రత్యర్థికి 120 పరుగుల విజయాన్ని అందించింది.

English summary